Nagarjuna : అక్కినేని నాగార్జునతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తారు. 64ఏళ్ల వయసులోనూ అమ్మాయిల కలల రాకుమారుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు. మన్మథుడిగా కుర్రహీరోలు సైతం కుళ్లుకునేలా బాడీని మెయింటేన్ చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఓ మన్మథుడు.. ఓ కింగ్, నవ సామ్రాట్ ఇలా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అందరూ ఆయనతో సినిమా ఛాన్స్ వస్తే చాలు అనుకున్న వారే. అయితే ఓ హీరోయిన్ మాత్రం అలాంటి ఛాన్స్ వస్తే ఏకంగా సినిమాను రిజెక్ట్ చేసిందట.
ప్రస్తుతం ఈ వార్త మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు హీరోయిన్ గా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది నదియా. ఆమె వాస్తవానికి నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నాగార్జున పాత్రకు తగ్గట్లు కొంచెం రొమాంటిక్ యాంగిల్స్ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ కారణంతోనే నదియా ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ఈ పాత్ర కోసం ఆ తర్వాత రమ్య కృష్ణని అప్రోచ్ అయ్యారట మేకర్స్.
ఒకవేళ నాగార్జున – నదియా కాంబినేషన్ సెట్ అయి ఉంటే మాత్రం.. నో డౌట్ సోగ్గాడే చిన్నినాయన సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ కాదు అంతకుమించిన రేంజ్ లో బాక్సాఫీసును షేక్ చేసేది. నదియా నాగార్జున అక్కడ అక్కడ గిల్లేస్తాడని తెలిసి సినిమాను వదిలేసుకుందట. దీంతో నదియా ఆ మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది అంటున్నారు ఆమె ఫ్యాన్స్.