Niharika – Naga Chaitanya : మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా చేసేందుకు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేక నానావస్థలు పడుతోంది. ఈ క్రమంలోనే భర్తతో విడాకులు తీసుకుని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ కు గురైంది. మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే పనిలో ఉంది. ఈ క్రమంలోనే రెచ్చిపోయి మరీ హాట్ హాట్ ఫోటో షూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిహారికకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. నిహారిక – నాగచైతన్య కాంబోలో ఓ ఇండస్ట్రీ హిట్ సినిమా మిస్ అయిందట.
అక్కినేని నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. జోష్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా తెరంగేట్రం చేశాడు . ఆ తర్వాత హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా బోలెడన్ని సినిమాల్లో నటించాడు. ఆయన కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నటించిన సినిమా 100% లవ్. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందే తెలిసిందే. సుకుమార్ చైతన్యని డిఫరెంట్ యాంగిల్ లో ప్రజెంట్ చేశాడు. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ సుకుమార్ హీరోయిన్ తమన్నా కంటే ముందే మెగా డాటర్ నిహారికను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయాలని ఆశపడ్డాడట.
కానీ మెగా ఫ్యామిలీ అందుకు ఒప్పుకోలేదట. అప్పట్లో నిహారికకు హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కు ఎక్స్ప్రెస్ చేయలేకపోయిందట. ఆ కారణంగానే ఈ సినిమాకు ఓకే చెప్పలేకపోయిందట. ఆ తర్వాత హీరోయిన్ గా తమన్నాను తీసుకున్నారట. ఆ సినిమాలో నిహారిక నటించినట్లుంటే తన కెరీర్ మరో విధంగా ఉండేదని నెటిజన్లు భావిస్తున్నారు.