Amar : బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు నుండే ఆడియన్స్ లో మంచి పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ లో ఒకరు అమర్ దీప్. టీవీ సీరియల్స్ మరియు వెబ్ సిరీస్ లలో హీరో గా అమర్ దీప్ కి మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మంచి టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. అంత టాలెంట్ ఉన్న అమర్ దీప్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి నాలుగు వారాల్లో అసలు గేమ్ ఆడలేదు.
ఆడినా కూడా అన్నీ దొంగ ఆటలే ఆడుతూ వచ్చాడు. అందువల్ల అమర్ దీప్ కి బోలెడంత నెగటివిటీ వచ్చింది. ఇన్ని రోజులు మనం చూసిన అమర్ దీప్ ఇతనేనా, బిగ్ బాస్ లో ఇంత వీక్ గా ఉన్నదేంటి అని అనుకున్నారు అందరూ. కానీ ఎప్పుడైతే అర్జున్ ద్వారా తన ఆట వరస్ట్ గా ఉందని తెలుసుకున్నాడో అప్పటి నుండి టాస్కులు పర్ఫెక్ట్ గా ఆడుతూ వచ్చాడు.
ఇక ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్కులో అయితే అమర్ దీప్ తన విశ్వరూపం చూపించేసాడు. కానీ స్నేహితులు అనుకున్న గౌతమ్ మరియు రతికా అమర్ దీప్ ని టార్గెట్ చేసి అతని టవర్ ని కూల్చాలని ప్రయత్నం చెయ్యడం అమర్ దీప్ కి బాధని కలిగించింది. ఆ బాధలో నుండి వచ్చి ఎమోషన్ నిన్న అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. తనకి శోభా శెట్టి తప్ప సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు కూడా లేరు అనే బాధ, శివాజీ మరియు అతని బ్యాచ్ మొదటి నుండి పనికిమాలిన వాడు, గేమ్స్ ఆడడం రాదు అంటూ అమర్ దీప్ పై వేసిన ముద్ర, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకువచ్చేలోపు గుండెలు పగిలేలా ఏడ్చేశాడు.
అతని ఏడుపు చూస్తూ ఉంటే ప్రతీ ఒక్కరికి అయ్యో పాపం అని అనిపించింది. గౌతమ్ ప్రియాంక పట్ల నేరుగా స్టాండ్ తీసుకున్నాడు, ఆమెకి సపోర్ట్ చేసాడు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ గత వారం రతికా కూడా అమర్ దీప్ కెప్టెన్సీ టాస్కు లో త్యాగం చేసాడు. రతికా ఏమాత్రం కూడా విశ్వాసం చూపకుండా అమర్ దీప్ ని టార్గెట్ చెయ్యడం ని చూస్తే అసలు ఈమె మనిషేనా అనే ఫీలింగ్ వస్తుంది. అమర్ దీప్ అంతలా ఎమోషనల్ అవ్వడానికి రతికా నే ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా అమర్ దీప్ అలా గుండెలు పగిలేలా ఏడవడం ఆయన్ని ఇష్టపడని వాళ్లకు కూడా బాధని కలిగించింది.