Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజకు పెళ్లిళ్లు అచ్చిరాలేదని చెప్పాలి. చదువుకునే రోజుల్లో తన క్లాస్ మేట్ శిరీష్ భరద్వాజ్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఓ పాప పుట్టాక అతనితో విడిపోయింది. తర్వాత కల్యాణ్ దేవ్ ని పెళ్లాడింది. వీరికి ఓ పాప నవిష్క. కళ్యాణ్ దేవ్ తో కూడా శ్రీజకు చెడిందని టాక్. దాదాపు రెండేళ్లుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటున్నారు.
శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడిపోయారని స్టోరీలు వస్తున్నా ఎవరూ స్పందించట్లేదు. అఫీషియల్ గా డివోర్స్ తీసుకున్నారా? లేదా? అనేది కూడా తెలీదు. మరోవైపు శ్రీజ మూడో పెళ్లిపై కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.శ్రీజ- కల్యాణ్ దేవ్ విడివిడిగా ఉండటంతో మధ్యలో చిన్నపాన నలిగిపోతుంది.
శ్రీజ దగ్గరే ఉంటున్న నవిష్క అప్పుడప్పుడు కల్యాణ్ దేవ్ ని కలుస్తుంది. పాప ఎప్పుడు వచ్చినా.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కల్యాణ్ దేవ్ పోస్టు చేస్తాడు. దీపావళి కోసం నవిష్క తండ్రి కల్యాణ్ దేవ్ దగ్గరకు వచ్చింది. పట్టు పరికిణీలో ఉన్న నవిష్కతో కల్యాణ్ దేవ్ దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు.
తల్లి శ్రీజ లేకుండానే నవిష్క తండ్రి కల్యాణ్ దేవ్ తో దీపావళి చేసుకుంది. నవిష్క, కల్యాణ్ దేవ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రీజకు దూరమయ్యాక కల్యాణ్ దేవ్ సినిమాలు చేయడం లేదు. మెగా ఫ్యామిలీ సపోర్ట్ కోల్పోవడంతో కల్యాణ్ దేవ్ మూవీస్ చేయట్లేదని టాక్.