Anchor Suma : ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ప్రోగ్రామ్స్, ప్రముఖుల ఇంటర్వ్యూలు.. ఇవి ఉంటే అందరికి గుర్తొచ్చే స్టార్ యాంకరే సుమ కనకాల. స్టార్ హీరోలవి ఏ ఫంక్షన్స్ అయినా సుమ ఉండాల్సిందే. ఎక్కడ చూసినా సమ కన్పిస్తుండటంతో హీరోలు, డైరెక్టర్లు ఆమెపై జోక్స్ వేస్తూ ఉంటారు. బుల్లితెరపై అనేక కార్యక్రమాలు చేస్తుంది సుమ. ఇటీవల జబర్దస్త్ కమెడియన్లు చేసిన దీపావళి ఈవెంట్ లోనూ సుమ పాల్గొంది. తను జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు గుర్తు తెచ్చుకుని గుక్కపెట్టి ఏడ్చింది.

మలయాళీగా పుట్టిన తాను స్టార్ యాంకర్ గా మారడానికి కారణం తెలుగు ప్రేక్షకుల అభిమానం, ప్రేమే అని తెలిపింది యాంకర్ సుమ. ఫ్యాన్స్ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని గుర్తుచేసుకుంది. ఈ ప్రోగ్రాంకి హాజరైన మరో యాంకర్ శిల్ప చక్రవర్తి సుమ అనుభవించిన కష్టాల గురించి చెప్పింది. కొన్ని సార్లు షూటింగ్స్ నుంచి సుమ ఆలస్యంగా వచ్చేదంట. దీనితో బాగా లేట్ నైట్ అయ్యేదని.. ఆ టైంలో ఎంతసేపు తలుపు తట్టినా తీసేవారు కాదని తెలిపింది శిల్ప. దీంతో సుమ చాలాసార్లు రాత్రిళ్లు మెట్లపైనే పడుకోవడం చూశానంది శిల్ప చక్రవర్తి.

మరోవైపు ఇదే ఈవెంట్ లో సుమ కుమారుడు రోషన్ కనకాల కూడా గెస్ట్ గా హాజరయ్యాడు. రోషన్ నటించిన ఫస్ట్ మూవీ బబుల్ గమ్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. తన కష్టాలు గుర్తుకు రావడంతో సుమ కంటతడి పెట్టుకుంది. అక్కడే ఉన్న రోషన్ సుమను హద్దుకుని ఓదార్చాడు.