Anushka Shetty : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒకరు అనుష్క శెట్టి. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన సూపర్ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా అనుష్క శెట్టి, ఆ తర్వాత వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో నటించి అనతి కాలం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలా హీరోయిన్ గా రాణిస్తున్న సమయం లో ‘అరుంధతి’ లాంటి లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు చేసి ఇండస్ట్రీ ని షేక్ చేసింది.

ఈ చిత్రం తర్వాత ఆమె విజయశాంతి తర్వాత నేటి తరం లో అలాంటి లేడీ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకుంది. ఇకపోతే సౌత్ లో ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. కానీ తెలుగులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో ఇప్పటి వరకు ఆమె నటించలేదు.

కానీ రామ్ చరణ్ తో ఈమెకి మూడు సార్లు నటించే అవకాశం వచ్చినా కూడా నటించలేదట. ఉదాహరనికి దర్శక ధీరుడు రాజమౌళి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం ‘మగధీర’ లో ముందుగా హీరోయిన్ రోల్ కోసం అనుష్క నే అనుకున్నారట. కానీ అప్పట్లో ఆమె డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఆ క్రేజీ ప్రాజెక్ట్ ని మిస్ చేసుకుందట. ఈ సినిమా తర్వాత మరో మూవీ స్టోరీ మొత్తం విని నాకు నచ్చలేదు అని రిజెక్ట్ చేసిందట.

ఇక చివరి మూడవ చిత్రం ఆమె మిస్ చేసుకున్నది ‘గోవిందుడు అందరి వాడేలే’. కృష్ణ వంశీ దర్శకత్వం లో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమర్షియల్ గా హిట్ అయ్యింది. ఇందులో కాజల్ అగర్వాల్ పాత్రకు ముందుగా అనుష్క ని సంప్రదించారు. కానీ ఒప్పుకోలేదు, ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ ఫ్యాన్స్ మా హీరో అంటే నీకు అంత చిన్న చూపా అని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి తిడుతున్నారు.