Payal Rajput : యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో పాయల్ రాజ్ పుత్ ముందు వరుసలో ఉంటుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ హాట్ బ్యూటీ యూత్ మదిలో పదిలమైన స్థానం ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే నెగటివ్ రోల్ లో అదరగొట్టిన ఈ హాట్ బ్యూటీ కి అవకాశాలు అయితే బాగానే వచ్చాయి కానీ, పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కలేదు.

అంతే కాదు ఈమె ఉన్న ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతూ వచ్చింది. కానీ యూత్ లో ఆమెకి ఉన్న క్రేజ్ కారణంగా సినిమాల్లో అవకాశాలు రావడం మాత్రం ఎప్పుడూ ఆగలేదు. ప్రస్తుతం ఆమె ఆర్ ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన ‘మంగళవారం’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొన్నది పాయల్ రాజ్ పుత్. అందులో భాగంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన మొదటి ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నేను చదువుకునే రోజుల్లో ఒక అబ్బాయిని చాలా ఇష్టపడ్డాను. అతన్ని చూసిన వెంటనే నాలో ఏవో ఫీలింగ్స్ కలిగేవి, మనసుకి చాలా ఆనందం వేసింది కూడా.
ఒకరోజు ఆపుకోలేక ఎలా అయినా అతనికి ప్రపోజ్ చెయ్యాలని ధైర్యం చేశాను. కానీ నా ప్రేమని తెలిపాక అతను నన్ను రిజెక్ట్ చేసాడు. ఆ బాధ నుండి నేను కోలుకోవడానికి చాలారోజుల సమయమే పట్టింది. పరీక్షలు సరిగా రాయలేకపోయాను, మార్కులు చాలా తక్కువ వచ్చాయి. అతన్ని మర్చిపోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. కానీ మా అమ్మ నాకు ధైర్యం గా నిల్చి నన్ను ఆ బాధ నుండి బయటపడేసింది’ అంటూ చెప్పుకొచ్చింది.