Nithya Menon : భిన్నమైన ఆలోచనలతో ఉండే అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు నిత్యా మీనన్. ఫేమ్ వస్తుంది, క్రేజ్ వస్తుంది, డబ్బులు వస్తాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చెయ్యదు. తన పాత్ర బలంగా ఉండాలి, కథ బాగా నచ్చాలి, అప్పుడే ఆమె ఒక సినిమాకి సంతకం చేస్తుంది. ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా కూడా ఆమె పెట్టుకున్న ఈ నియమాలు కచ్చితంగా ఉండాల్సిందే.
లేకపోతే ఆమె సినిమా చెయ్యదు. సాధారణంగా ఇలాంటి లిమిట్స్ పెట్టుకున్న హీరోయిన్స్ కెరీర్ ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే దర్శక నిర్మాతల డిమాండ్స్ స్క్రిప్ట్ కి మరియు నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి. కానీ నిత్యామీనన్ మాత్రం ఇప్పటికీ మంచి క్రేజ్ మరియు డిమాండ్ ఉన్న హీరోయిన్ గా సౌత్ లో కొనసాగుతూనే ఉంది. ఇది సాధారణమైన విషయం కాదు.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమెకి ఉన్న అలవాట్లు, ఇష్టాఇష్టాలను పంచుకుంది. యాంకర్ నిత్యా మీనన్ తో మాట్లాడుతూ ‘మీకు అసలు టీవీ చూడడమే ఇష్టం ఉండదు అంట కదా’ అని అడుగుతాడు. అప్పుడు నిత్యా మీనన్ ‘అవును నాకు అసలు టీవీ చూడడం అంటే ఇష్టం లేదు. మా ఇంట్లో కూడా టీవీ లేదు. ఎదో చిన్నది ఒకటి ఉంది, అది ఎలా ఆన్ చెయ్యాలో కూడా నాకు తెలియదు. నేను వార్తలు చూడను, వార్తలు చదవను, అసలు వాటిపై ఆసక్తి లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
అప్పుడు యాంకర్ మాట్లాడుతూ ‘మరి ప్రపంచం లో జరిగే విషయాలు మీకు ఎలా తెలుస్తాయి అండీ’ అని అడగగా, దానికి నిత్యామీనన్ ‘తెలుసుకొని ఏమి చెయ్యాలండి, నాకు ఏమి ఉపయోగం లేదు, పని చేసుకోవడం ఇంటికి వచ్చి పడుకోవడం, ఇదే నాకు తెలిసింది’ అంటూ చెప్పుకొచ్చింది నిత్యా మీనన్.