Bigg Boss Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ లోకి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వచ్చారు. శివాజీ, గౌతమ్ , యావర్ , భోలే శవాలీ మరియు రతికాలలో ముగ్గురు టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారు. కచ్చితంగా వీరు టాప్ 5 లోకి ఎంటర్ అవ్వగల సత్తా ఉన్న కంటెస్టెంట్స్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అయితే వీరిలో టాప్ 5 లోకి ఎంటర్ అయ్యే సత్తా ఉన్న గౌతమ్ మరియు యావర్ ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కొన్ని అనధికారిక వెబ్ సైట్స్ లో జరిగిన పోలింగ్స్ లో గౌతమ్ కి తక్కువ ఓట్లు ఉండగా, కొన్ని సైట్స్ లో యావర్ కి తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా రతికా కి వీళ్లిద్దరి కంటే ఎక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.
శివాజీ తో గొడవలు పెట్టుకోవడం గౌతమ్ కి మైనస్ అయ్యిందా?, వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవలో గౌతమ్ తప్పు ఎంత ఉందో, శివాజీ తప్పు కూడా అంతే ఉంది. స్ట్రాటజీ పేరు తో గౌతమ్ వృత్తిని లాగి శివాజీ కామెంట్స్ చెయ్యడం సరికాదు. అలాగే అశ్వినీ చెప్పిన మాటలని నమ్మి, శివాజీ తనని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు అనే గౌతమ్ వాదన కూడా కరెక్ట్ కాదు. కానీ ఓటింగ్ లో ఎక్కువ ప్రభావం గౌతమ్ మీదనే పడుతుంది.
మరోపక్క యావర్ మూడు వారాల నుండి తన రేంజ్ లో గేమ్ ఆడడం లేదు. రతికా రీ ఎంట్రీ తర్వాత ఆమె మాయలో పడిపోయి తన గేమ్ ని మొత్తం డౌన్ చేసేసుకున్నాడు. కాబట్టి యావర్ గ్రాఫ్ కూడా బాగా తగ్గిపోయింది. ఇలా టాప్ 5 లో ఉండాల్సిన ఈ తోపు కంటెస్టెంట్స్ ఇప్పుడు డేంజర్ జోన్ లోకి వచ్చారు. కానీ రాబొయ్యే రోజుల్లో ఇది మారొచ్చు, భోలే శవాలీ మరియు రతికాలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు, చూడాలి మరి ఏమి జరగబోతుందో అనేది.