VarunLav : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరో లావణ్య త్రిపాఠి దాదాపు ఆరేళ్ల ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. వీరి పెళ్లి బుధవారం రాత్రి ఇటలీలోని టస్కానీలో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్ మూడు ముళ్ల వేశాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో పాటు యంగ్ హీరోలంతా షూటింగ్స్‌కి బ్రేక్‌లు తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు. ప్రస్తుతం వీళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా వీరి గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరుణ్, లావణ్యాల ఫస్ట్ నైట్ జరగలేదంటూ మెగా హేటర్స్ కొందరు సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి ఇరు కుటుంబ సభ్యులు ఇటలీలో ఉండగానే వీళ్ల ఫస్ట్ నైట్ ప్లాన్ చేశారట. అయితే సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం మంచి గడియలు లేవని.. నవంబర్ 6వ తేదీ తరువాతనే వాళ్ల శోభనం జరగాలని మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులుగా ఉండే పండితులు చెప్పారట. అందువల్లనే వీరి మొదటి రాత్రి జరుగకుండా ఆగిపోయిందట. కొందరు దీనిని కూడా బేస్ చేసుకుని అసభ్యకరంగా కామెంట్ చేస్తున్నారు.
వీటిపై స్పందిస్తున్న మెగా అభిమానులు మండిపడుతున్నారు. కందకి లేని దురద కత్తికి ఎందుకు.. వాళ్లకే లేని బాధ మీకెందుకు రా.. వాళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడే ఒక్కటవుతారు మీకు అనవసరం అంటూ మండి పడుతున్నారు. ఇక వరుణ్ – లావణ్యల రిసెప్షన్ నేడు హైదరాబాదులో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ స్నేహితులు, రాజకీయనేతలు దాదాపు 1000మందికి పైగా హాజరుకానున్నారు.