Aishwarya Rai : ప్రపంచ సుందరి గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చూపులు తిప్పుకోలేని అందం, అద్భుతమైన అభినయం, ఇలాంటి కలయిక అందరికి దక్కడం చాలా కష్టం, నూటికో కూటికో ఒకరిద్దరికి అలాంటి అవకాశాలు వస్తుంటాయి. వారిలో ఒకరే ఐశ్వర్య రాయ్. మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువుర్’ అనే తమిళ సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఐశ్వర్య రాయ్, ఆ తర్వాత శంకర్ దర్శకత్వం లో వచ్చిన ‘జీన్స్’ సినిమా ద్వారా మంచి క్రేజ్ ని దక్కించుకుంది.
ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాయ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ, ఇండియా లో ఉన్న క్రేజీ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి అశేష ప్రేక్షాభిమానం సంపాదించుకుంది. అయితే ఐశ్వర్య రాయ్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం లో ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అసలు విషయం లోకి వెళ్తే అప్పట్లో ఒక ప్రముఖ బాలీవుడ్ హీరో ఐశ్వర్య రాయి తో ప్రేమాయణం నడిపాడు. అతని వల్ల ఆమెకి ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి అని అంటుంటారు కానీ, ఆమె టాలెంట్ తోనే ఆ అవకాశాలను సంపాదించుకుంది. అయితే ఆ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమాలో నటించకూడదు అని చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఐశ్వర్య రాయి లెక్క చెయ్యకుండా షారుఖ్ ఖాన్ సినిమాలో నటించడానికి ఒప్పుకుందట. డేట్స్ కూడా ఇచ్చి మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్నది అట. ఈ విషయం తెలుసుకున్న ఆ స్టార్ హీరో, నేరుగా ఆ షూటింగ్ స్పాట్ కి వెళ్లి, ఐశ్వర్య రాయి ని చితక్కొట్టి , జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్లి కార్ లో పడేసాడట. ఈ సంఘటన తో ఐశ్వర్య రాయి మనసు బాగా చితికి పోయింది. ఏడుస్తూ ఇక ఆ స్టార్ హీరో తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు అని నిర్ణయించుకుంది.
పక్క రోజు షూటింగ్ కి వెళ్తే నిన్న జరిగిన సంఘటన కి హీరో , డైరెక్టర్ బాగా బాధపడ్డారు, మీ స్థానం లోకి రాణీ ముఖర్జీ ని తీసుకున్నారు అని చెప్పి ఐశ్వర్య రాయ్ ని వెనక్కి పంపేసారట. ఆ చిత్రం పేరు ‘దిల్ సే’. ఇంతకీ ఐశ్వర్య రాయ్ ని అంతలా టార్చర్ పెట్టిన ఆ స్టార్ హీరో ఎవరో మీ అందరికీ ఈ పాటికే అర్థం అయిపోయి ఉంటుంది. బాలీవుడ్ ని దశాబ్దాల తరబడి ఏలుతున్న ముగ్గురు ఖాన్స్ లో ఒకడు అట. అతనికి ఇప్పటికీ పెళ్లి కాలేదట, ఎవరో మీరే కనుక్కోండి.