Bigg Boss Telugu ఈ వారం ఎంత రసవత్తరంగా సాగుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నామినేషన్స్ పర్వం అయితే హౌస్ ని హీటెక్కించేసింది. ఈ నామినేషన్స్ లో అమర్ దీప్ బాగా హైలైట్ అయ్యాడు. దీంతో తన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఈసారి నామినేషన్స్ లోకి శివాజీ, పల్లవి ప్రశాంత్, గౌతమ్, అశ్విని తప్ప హౌస్లో ఉన్న అందరు కంటెస్టెంట్స్ వచ్చారు. తర్వాత ఈ వారం శోభా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోతుందని అందరికీ అర్థం అయిపోయింది. ఈ విషయం ఆమెకి కూడా అర్థం అయింది కాబట్టే ఈ వారం బాగా డల్ అయిపోయింది. ఇంతకు ముందు తనలో కనిపించినంత పొగరు, యాటిట్యూడ్ ఈ వారం ఆమెలో కనిపించలేదు.
అసలు ఈ ఎనిమిది వారాలు చూసిన శోభానేనా మనం చూసేది అన్నట్లు ఈ వారం అనిపించింది. ఇలా మొదటి నుండి ఉండుంటే నేడు ఇలా డేంజర్ జోన్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ నెటిజన్స్ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ మొత్తం ‘ఉల్టా పల్టా’ అని చెబుతూనే ఉన్నారు. మొదటి నుండి ప్రేక్షకులు ఊహించినట్టు, హౌస్ మేట్స్ కోరుకున్నట్లు ఒక్కటి కూడా జరుగడం లేదు. ఎవ్వరూ ఊహించనివి హౌసులో జరుగుతున్నాయి. సేమ్ అలాగే ఈ వారం కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ సీజన్ మొదలై 8 వారాలు అయింది.. హౌస్ లో ఇంకా 11 మంది ఉన్నారు. కచ్చితంగా ఏదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ ఉండాల్సిందే. అది ఈ వారమే అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం చూస్తే శోభా శెట్టి తో పాటు టేస్టీ తేజా కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. వీళ్లిద్దరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈసారి హౌస్ లో లవ్ ట్రాక్స్ ఎక్కడా కనిపించలేదు. తేజా, శోభా శెట్టి మధ్యే చిన్న లవ్ ట్రాక్ నడుస్తూ వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే వీళ్లిద్దరి మధ్య జోకులు, ఎమోషనల్ బాండింగ్ ఇలా ప్రతీ ఒక్కటి చూసిన ఆడియన్స్ కి అలా అనిపిస్తూ ఉండొచ్చు. అలాంటి జంట హౌస్ నుండి ఒకేసారి బయటికి పోతే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి. తేజ బిగ్ బాస్ హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ కాబట్టి అతను హౌస్ నుండి ఎలిమినేట్ అయితే టీఆర్ఫీ రేటింగ్స్ పై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని పెట్టకపోవచ్చన్నది కొందరి అభిప్రాయం.