Vishwaksen : విశ్వక్ సేన్ కు అంత బలుపుంటే నేనేం చేస్తా.. నిర్మాత నాగవంశీ ఘూటు వ్యాఖ్యలు..

- Advertisement -

Vishwaksen : హీరో విశ్వక్‌సేన్ ప్రస్తుతం ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబర్ 8న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఇటీవల ఈ సినిమా రిలీజ్ గురించి విశ్వక్ సేన్ చేసిన ఒక పోస్టు బాగా వైరల్ గా అయ్యింది. తాజాగా ఈ విషయం గురించి నిర్మాత నాగవంశీని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ..

Vishwaksen
Vishwaksen

“మేము గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు డిసెంబర్ 8న కేవలం వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వ్యాలెంటైన్’ మాత్రమే ఉంది. ఆ తరువాత నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఆ డేట్స్ లోకి వచ్చాయి. అయితే మేము మూవీని పోస్టుపోన్ చేద్దామని అసలు అనుకోనేలేదు. మరి విశ్వక్ ఎందుకు అలా మాట్లాడాడో తెలియదు. ఆ విషయం మీరు అతనినే అడగాలి. గ్యాంగ్స్ అఫ్ గోదావరి షూటింగ్ అయితే ఇంకా బ్యాలన్స్ ఉంది. ఒక సాంగ్ చిత్రీకరించాల్సి ఉంది. ఆ తరువాత మూవీ అవుట్ పుట్ చూసుకోవాల్సి ఉంది. చూసిన తరువాత సినిమా కాన్ఫిడెంట్ ఉంటే.. డిసెంబర్ 8 నుంచి వెనక్కి తగదు లేదు. అప్పటి వరకు ఎవరు పోస్టుపోన్ మాట కూడా మాట్లడం” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంతకు ఆ పోస్టులో విశ్వక్ సేన్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే.. “బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు. నేను సినిమా చూడకుండా ప్రతి ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెప్తున్నా. డిసెంబర్ 8న ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ వస్తుంది. హిట్, అట్టర్ ఫ్లాప్ అనేది మీ డెసిషన్. ఆవేశానికో, ఈగోకో తీసుకున్న డెసిషన్ కాదు ఇది. తగ్గేకొద్దీ మింగుతారని అర్థమైంది. డిసెంబర్ 8 శివాలెత్తిపోద్ది. గంగమ్మ తల్లికి నా ఒట్టు. మహాకాళి నాతో ఉంది. డిసెంబర్ లో సినిమా రిలీజవ్వకపోతే నేను ఇక ప్రమోషన్స్ లో కనబడును” అంటూ పోస్ట్ చేశాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here