Varalaxmi Sarathkumar : బాహుబలి సినిమా తర్వాత వచ్చిన పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని అనుకున్న స్థాయిలో ఉపయోగించుకొని కెరీర్ లో అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోయిన హీరో దగ్గుపాటి రానా. మధ్యలో వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాలకు దూరం అవ్వడం జరిగింది. బాహుబలి తర్వాత ఆయన ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో హీరో గా నటించాడు. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ సినిమా తర్వాత ఆయన ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం లో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించాడు. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం లో నటించాడు. పవర్ స్టార్ తో నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడుతూ నటించిన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘విరాట పర్వం’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మెగాస్టార్ చిరంజీవి మరియు వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో మెయిన్ విలన్ గా నటించడానికి ఒప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర హాలీవుడ్ లోని మార్వెల్ సిరీస్ లో ‘లోకి’ పాత్ర తరహాలో ఉంటుందని టాక్. అయితే ఈ చిత్రం లో రానా కి జోడిగా బాలయ్య బాబు చెల్లెలు నటిస్తుందని తెలుస్తుంది.
బాలయ్య చెల్లెలు అంటే నిజంగా బాలయ్య చెల్లెలు కాదు, ‘వీర సింహా రెడ్డి’ చిత్రం లో బాలయ్య కి చెల్లెలుగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్. అందులో ఆమె పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో, చిరంజీవి – వశిష్ఠ సినిమాలో అంతకు మించి పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం, ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోనుంది. ఈ చిత్రానికి ‘విశ్వంభర’ టైటిల్ ని అనుకుంటున్నారు.