Samantha : నాగచైతన్యపై ప్రేమను చంపుకోలేకపోతున్న సమంత.. ఇన్ డైరెక్ట్ గా ఇలా చెప్పిందా!

- Advertisement -

Samantha : స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు దగ్గరగానే ఉంటారు. తాను ఎక్కడ పర్యటిస్తుంది? తాను ఏం చేస్తుంది? తన స్నేహితులెవరు? తనకు అత్యంత ఆప్తులెవరు? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటుంది. ఇటీవలే అమెరికా, ఇటలీ, ఆస్ట్రియా పర్యటనలను పూర్తిచేసింది. మయోసైటిస్ వల్ల కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తనకు ముందుగానే అడ్వాన్స్ లు ఇచ్చిన నిర్మాతలకు వాటిని తిరిగిచ్చేసింది. నాగచైతన్యతో విడాకులిచ్చిన తర్వాత సమంత మానసికంగా చాలా అలిసిపోయిందని, తెలియని వేదనను అనుభవిస్తోందని ఆమె అభిమానులు చెబుతుంటారు.

Samantha
Samantha

వీరిద్దరూ విడిపోవడంలో సమంతది తప్పని కొందరంటే, మరికొందరు మాత్రం నాగచైతన్యది తప్పని వాదించుకుంటుంటారు. అయినా తన పనితాను చూసుకుంటూ వెళుతుంటుంది సామ్. లేటెస్ట్ గా సమంత పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. అందులో ఒక రాబిట్ ఒక పువ్వు పట్టుకొని.. ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తుంది. ఈ ఫ్లవర్ నీ కోసం తెచ్చాను కాకపోతే చిన్న పొరపాటువల్ల ఈ ఫ్లవర్ పైన కొంచెం తిన్నాను అని చెబుతుంది.

ఆ అబ్బాయ్ నవ్వుతూ పర్వాలేదు.. ప్రేమ పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు.. నిజమైన ప్రేమ ఉంటే చాలు అంటాడు. ఈ పోస్ట్ చూసిన వారంతా సమంత ప్రేమ గురించి ఈ పోస్టు ఇప్పుడు ఎందుకు పెట్టిందంటూ చర్చించుకుంటున్నారు. సమంత ఉద్దేశం అదే అయినప్పుడు సమంత నిజమైన ప్రేమను అతను ఎందుకు గుర్తించలేకపోయాడు? సమంత ఇప్పటికీ చెబుతోంది రియల్ గానే ప్రేమిస్తున్నాను అని నెటిజన్లు అనుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here