Varun Lav : మెగా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిల వివాహానికి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీలో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా షురూ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఈ జంటకు బ్యాచ్‌లర్ పార్టీ ఇచ్చారు. హీరో అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి.. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్, ఆయన సతీమణి షాలినీ, నటి రీతూవర్మ, పలువురు సన్నిహితులు ఈ పార్టీకి హాజరై సందడి చేశారు.
పెళ్లి షాపింగ్ పూర్తి చేసుకున్న ఈ జంట నవంబర్ 1న జరగున్న తమ పెళ్లి కోసం శుక్రవారం రోజున ఇటలీకి వెళ్లింది. వీరితోపాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా ఇటలీ ఫ్లైట్ ఎక్కుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో వరుణ్-లావణ్యలతో పాటు నిహారిక కూడా కనిపించింది.

ఇక ఇప్పటికే రామ్ చరణ్-ఉపాసన ఇటలీలో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ కుమార్తె క్లీంకారను తీసుకుని ఈ జంట ఇటలీ వెకేషన్‌కు వెళ్లింది. వారు అక్కడి నుంచే టుస్సానీలో జరగనున్న వరుణ్-లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు హాజరవుతారు. వీరితో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇటలీకి చేరుకున్నారు. తాజాగా ఇవాళ ఉదయం పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తన భార్యతో కలిసి టుస్సానీకి బయల్దేరారు. కుటుంబసభ్యులు, అతి తక్కువమంది బంధువుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరుగుతోంది.
పెళ్లి తర్వాత రిసెప్షన్ మాత్రం హైదరాబాద్‌లోనే ఉండనుందట. ఈ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనున్నారట. రిసెప్షన్‌కు సంబంధించిన శుభలేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అందులో ముఖ్యంగా చిరంజీవి-సురేఖల పేర్లు పైన ఉండటం ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా ఆకర్షిస్తున్న విషయం. వరుణ్-లావణ్యల పెళ్లి రిసెప్షన్.. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాలులో రాత్రి ఏడు గంటలకు ప్రారంభం అవుతుందని శుభలేఖలో కనిపించింది.
ఈ ఆహ్వాన పత్రికలో వరుణ్ తల్లిదండ్రుల పేర్లు నాగబాబు, పద్మజ, లావణ్య తల్లిదండ్రులు కిరణ్, దియోరాజ్ త్రిపాఠి, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లు కూడా కనిపించాయి. మిస్టర్’ సినిమా సమయంలో ఫ్రెండ్స్ అయిన వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఆ తర్వాత ‘అంతరిక్షం’ షూటింగ్లో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ ఇప్పుడు వివాహ బంధంగా మారబోతోంది. ఈ సందర్భంగా ఈ జంటకు తెలుగు సినిమా సెలబ్రిటీలు కంగ్రాట్స్ చెబుతున్నారు.