Leo Movie : విజయ్ లియో మూవీ కలెక్షన్స్‌పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ఆరు రోజుల్లో ఈ మూవీ 450 కోట్ల మైలురాయిని దాటినట్లు సినిమా యూనిట్ పేర్కొన్నది. బుధవారం నాటితో ఈ సినిమా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. మంగళవారం రోజు ఇండియావైడ్‌గా ఈ మూవీ 30 కోట్ల వరకు వసూళ్లను సాధించినట్లు పేర్కొన్నాయి.
అయితే లియో కలెక్షన్స్, రికార్డులు అన్నీ ఫేక్ అంటూ నెటిజన్లతో పాటు ట్రేడ్ అనలిస్ట్‌లు కొందరు చెబుతోన్నారు. ఈ సినిమా చాలా చోట్ల హౌజ్‌పుల్ అంటూ వస్తోన్న వార్తలను ఖండిస్తున్నారు, సోమవారం తో పోలిస్తే మంగళవారం చెన్నైలోని చాలా థియేటర్ల నుంచి లియో సినిమాను తొలగించారని అంటున్నారు, సరైన బుకింగ్స్ లేని కారణంగా చెన్నై సిటీలో పలు థియేటర్లలో లియో తమిళ షోస్‌ను క్యాన్సిల్ అయినట్లు చెబుతోన్నారు. థియేటర్ల సంఖ్య సగానికి పడిపోయినట్లు పేర్కొంటున్నారు.
ప్రేక్షకులు లేక ఖాళీగా ఉన్న లియో స్క్రీనింగ్ థియేటర్ల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి. రజనీకాంత్ జైలర్ సినిమాతో లియో వసూళ్లను కంపేర్ చేస్తూ నెటిజన్లు చేస్తోన్న ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. జైలర్‌తో పోలిస్తే లియో బుకింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయని, కానీ విజయ్ సినిమా వసూళ్లను కావాలనే డబుల్ చేసి చూపిస్తున్నారని అంటున్నారు. ఫేక్ కలెక్షన్స్ కోసం సినిమా యూనిట్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తోన్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు. ఫేక్ కలెక్షన్స్‌ను లియో స్కామ్‌గా పేర్కొంటున్నారు. ఈ లియో స్కామ్ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.