Rathika Rose : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఎంత ఆసక్తికరంగా సాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్స్ అందరూ గేమ్స్ అద్భుతంగా ఆడుతున్నారు, ఆడియన్స్ కి అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అలాగే ప్రతీ వారం బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు కూడా ఊహించని రేంజ్ లో ఉంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఒకేసారి 5 మంది కొత్త కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు.
వారిలో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు కేవలం ముగ్గురు మిగిలారు. అయితే గతం లో ఎలిమినేట్ అయిన రతికా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అనిపించిన ఈమె , ఆ తర్వాత మెల్లిగా తగ్గుతూ వచ్చి నాల్గవ వారం లో ఎలిమినేట్ అయిపోయింది.
ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది, ఈసారి ఆమెలో ఏమైనా మార్పులు ఉంటాయేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతకు ముందు ఆమె ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తూ వచ్చిందో, ఇప్పుడు కూడా మళ్ళీ అదే పెర్ఫార్మన్స్ ని ప్రారంభించింది. బయట శివాజీ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది అనే విషయాన్నీ గమనించిన రతికా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టగానే ఆయన చెయ్యి పట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్లి కాళ్లకు దండం పెట్టింది. ఇక మీదట మీతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించను అని చెప్పుకొచ్చింది.
ఇక పల్లవి ప్రశాంత్ తో ఆమెకి జరిగిన గొడవల సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు అందరినీ పలకరించింది కానీ పల్లవి ప్రశాంత్ ని మాత్రం పలకరించలేదు. కాసేపు అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ రసగుల్లా ని తీసుకొచ్చి రతికా కి తినిపిస్తాడు. అక్కడితో వీళ్లిద్దరి మధ్య క్లాష్ కూడా ముగిసినట్టే. ఇక రాబొయ్యే రోజుల్లో రతికా ఎలా ఉండబోతుందో చూడాలి.