Katrina Kaif : సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ టాక్ వుంటే ఆస్తులు ఆటోమేటిగ్గా కూడబెట్టడం సులువు అని చాలా మంది నిరూపించారు..హీరోలని మించిన ఆస్తిని కొందరు హీరోయిన్లు పొగెసుకున్నారు..అందులో బాలివుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ ఒకటి..తన నటనతో, అందంతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమె తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో చేసింది ఒకటి రెండు సినిమాలైనా ఇప్పటికీ కూడా గుర్తింపు తెచ్చుకుంది.. ఆమె నటన ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు .
ఇది ఇలా ఉండగా తాను ప్రేమించిన విక్కీ కౌశల్ ను రాజస్థాన్లోని సవాయ్.. మాదాపూర్ జిల్లా బార్వారాలోని 700 సంవత్సరాల నాటి సిక్స్ సెన్సెస్ పోర్టులో రాజరిక పద్ధతిలో వివాహం చేసుకుంది.వీరి పెళ్ళి కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసారు..ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ చాలా వైరల్ గా మారుతుంది . అంతేకాదు కత్రినా కైఫ్ సంపాదన విషయంలో తన భర్త విక్కీ కౌశల్ కంటే ఎన్నో రేట్లు ముందు ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి కత్రినా మొత్తం ఆస్తి విలువ ఎన్ని కోట్లు వుందో ఇప్పుడు చుద్దాము..
కత్రినా కైఫ్ ఒక సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటుందంటే.. రూ.11 కోట్లు తీసుకుంటుంది.. సంవత్సరానికి ఏకంగా రూ.23 కోట్ల వరకు సంపాదిస్తోంది . అంతేకాదు పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం 7 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. ఇవేకాదు అత్యంత ఖరీదైన కార్లు కూడా ఈమె సొంతం. పలు ప్రదేశాలలో లగ్జరీ భవనాలు, ఫ్లాట్ లు కూడా వున్నాయి. వీటన్నింటిని కలిపి ఇప్పటివరకు ఈమె సుమారుగా రూ. 300 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది..విక్కీ కౌశల్ కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడు. ఆస్తి విలువ సుమారుగా రూ.30 కోట్లకు పై మాటే.. మొత్తానికి చూసుకుంటే కత్రినాకు బాగా ఆస్తి ఉందని తెలుస్తుంది..