Leo : సౌత్ లో ఇటీవల కాలం లో ‘లియో’ చిత్రం సృష్టించిన హైప్ ఏ సినిమాకి కూడా చూడలేదు అనేది వాస్తవం. ‘విక్రమ్’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనకరాజ్ తమిళ హీరో విజయ్ లాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో తో చెయ్యడం వల్ల ఈ చిత్రంపై షూటింగ్ ప్రారంభ దశ నుండే అంచనాలు తారాస్థాయిలో ఉండేవి. దానికి తగ్గట్టుగానే పాటలు, ట్రైలర్ ఇవన్నీ మూవీ పై మరింత అంచనాలు పెంచేలా చేసాయి.
అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రేంజ్ లో జరిగాయి. కేవలం తమిళనాడు లో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా టికెట్స్ కోసం జనాలు యుద్దాలు చేస్తే కానీ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని ‘భీమ్లా నాయక్’ మరియు ‘గుంటూరు కారం’ చిత్రాల నిర్మాత సూర్య దేవర నాగవంశీ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు.
అంటే తెలుగు లో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయ్యినట్టు అన్నమాట. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి మొదటి రోజు 15 కోట్ల రూపాయలకు పైగా లాభాల్ని రాబట్టింది అంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 12 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అట.
అంటే పెట్టిన డబ్బులకు ఓవరాల్ గా మూడు కోట్ల రూపాయిల లాభాలు మొదటి రోజే వచ్చేసిందట. ప్రపంచవ్యాప్తంగా అన్నీ వెర్షన్స్ కి కలిపి 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందట. అంటే షేర్ దాదాపుగా 65 కోట్ల రూపాయిలు ఉండొచ్చు. డివైడ్ టాక్ వచ్చినా కూడా వీకెండ్ లోపే ఓవరాల్ బ్రేక్ ఈవెన్ నెంబర్ ని కూడా దాటేస్తుందని మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. చూడాలి మరి.