Klin Kara : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి రీసెంట్ గా క్లిన్ కారా అనే ఆడబిడ్డ జన్మించిన సంగతి అందరికీ తెలిసిందే. పెళ్ళైన 12 ఏళ్లకు కలిగిన సంతానం ఈ పాప. అందుకే ప్రతీ విషయం లోను తల్లితండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా ఈ పాపని పెంచుతున్నారు. రామ్ చరణ్ మరియు ఉపాసన మరియు కుటుంబ సభ్యులను మినహా, ఇప్పటి వరకు ఎవరినీ కూడా ఈ పాపని ముట్టుకోనివ్వలేదు.

ఒక గాజు బొమ్మని ఎంత సున్నితంగా అయితే మనం చూసుకుంటామో, అంతకంటే సున్నితంగా క్లిన్ కారా ని చూసుకుంటున్నారు. ఇక ఈ పాప ముఖాన్ని ఇప్పటి వరకు చూపించకుండా చాలా జాగ్రత్తులు తీసుకున్నారు రామ్ చరణ్ మరియు ఉపాసన. పాపని ఎత్తుకున్న ఫోటోలను సోషల్ మీడియా లో చాలా అప్లోడ్ చేసారు కానీ, ముఖాన్ని మాత్రం ఎమోజీ తో కవర్ చేస్తున్నారు. ఒక ఏడాది నిండితే కానీ క్లిన్ కారా ముఖాన్ని చూపించారేమో!.

ఇకపోతే రీసెంట్ గానే ఈ జంట ఫారిన్ టూర్ కి పయనం అయ్యింది. విమానాశ్రయం లో వీళ్లకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఉపాసన క్లిన్ కారా ని ఎత్తుకోగా, రామ్ చరణ్ తానూ అల్లారు ముద్దుగా పెంచుకునే రైమ్ కుక్క పిల్లని ఎత్తుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన ఫోటోలలో ఆయన ఎక్కువ శాతం రైమ్ కుక్క ని ఎత్తుకోవడమే మనం చూసాము కానీ, క్లిన్ కారా ని ఎత్తుకోవడం చాలా తక్కువగా చూసాము.

దీనిని చూసి కొంతమంది అభిమానులు నీ కూతురుకంటే ఆ కుక్క ఎక్కువ అయిపోయిందా అన్నా, ఎప్పుడు దానితోనే ఉంటావ్ అంటూ రామ్ చరణ్ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ కి మూగ జీవాలు అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిందే. అంతే కాదు రైమ్ తో ఆయనకీ ఉన్న ప్రత్యేక అనుబంధం వేరు. కానీ కొంతమందికి సున్నితమైన శరీరం ఉన్న పసిబిడ్డను ఎత్తుకోవడం అంటే భయం, రామ్ చరణ్ కి కూడా ఆ భయం ఉందని, అందుకే క్లిన్ కారా ని తక్కువ సార్లు ఎత్తుకుంటాడేమో అని అంటున్నారు.
