Mahesh Babu : జక్కన్న సినిమా కోసం మహేష్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే కళ్లు బైర్లుకమ్మటం ఖాయం

- Advertisement -


Mahesh Babu : చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల జాబితాలో మహేష్ బాబు ముందుంటారు. తెలుగు ప్రేక్షకులందరికీ సూపర్ స్టార్‎గా కొనసాగుతున్న మహేష్ బాబు అంటే అమ్మాయిలకే కాదు.. అబ్బాయిల్లో కూడా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. మహేష్ బాబు వయసు పెరుగుతున్నప్పటికీ.. తన అందం మాత్రం పాతికేళ్ల దగ్గరే ఆగిపోయింది. ఇంకా చెప్పాలంటే ఆయన వయసు పెరుగుతున్న కొద్ది.. ఇంకా హ్యాండ్సమ్ గా మారిపోతున్నారనడంలో అతియోశక్తి లేదు.

Mahesh Babu Rajamouli
Mahesh Babu

ఇక మహేష్ బాబు సినిమాలకు ఎటువంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. అందుకే మహేష్ అడిగినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ముఖ్యంగా పోకిరి, దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు సినిమాల తర్వాత మహేష్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు మహేష్ బాబు.. రాజమౌళితో ఒక సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. 2024 ఏప్రిల్‎లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అఫీషియల్‎గా మొదలు కాబోతుంది.

Mahesh Babu

ఇకపోతే రాజమౌళి సినిమా అంటేనే భారీ బడ్జెట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహేష్ సినిమా కోసం కూడా భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా ఈ సినిమాకు మహేష్ బాబు.. ఇంతకు మునుపు తీసుకోనంత భారీ పారితోషకం డిమాండ్ చేస్తున్నారన్న గుసగుసలు వినబడుతున్నాయి. ఏకంగా రూ.110 కోట్లు అందుకోనున్నాడు అన్న వార్త ఇండస్ట్రీని ఊపేస్తోంది. అయితే టాలీవుడ్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ తో పోలిస్తే.. ఇది నిజంగా భారీ మొత్తమే అని చెప్పాలి. కాగా ఈ విషయం తెలిసిన కొందరు ఒక్క మహేష్ బాబే ఇంత మొత్తంలో తీసుకుంటే.. మరి గ్లోబల్ డైరెక్టర్ రాజమౌళి ఎంత తీసుకుంటాడో అని లెక్కలు వేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here