Leo Movie : ప్రస్తుతం సౌత్ ఇండియా మొత్తం తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో ‘ మేనియా లో మునిగి తేలుతుంది. కేవలం తమిళం లో మాత్రమే కాదు, తెలుగు కూడా ఈ సినిమా టికెట్స్ కి ఉన్న డిమాండ్ దసరా కి విడుదల అవ్వబోతున్న ఏ సినిమాకి కూడా లేదు అనడం లో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ మరియు బెంగళూరు వంటి ప్రాంతాలలో ‘భగవంత్ కేసరి’ మరియు ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలకంటే ఫాస్ట్ గా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
ఇది కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే, తమిళ వెర్షన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి ఇప్పటి వరకు 50 కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ నుండే వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే బుక్ మై షో లో కూడా ఈ చిత్రం సరికొత్త చరిత్ర ని తిరగరాసింది.
నిన్న ఉదయం ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభించారు. బుకింగ్స్ ప్రారంభం అయిన వెంటనే ఆ వేగం చూసి ట్రేడ్ పండితులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ఒక్క గంటలోనే 85 వేల టిక్కెట్లు హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి. ఇది ఆల్ టైం ఇండియన్ రికార్డు. అదే రేంజ్ ఊపు ని నిన్న మధ్యాహ్నం వరకు మైంటైన్ చేసింది.
చివరికి 24 గంటలు ముగిసే సమయానికి 6 లక్షల 50 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయట. ఇందులో నాలుగు లక్షలకు పైగా టిక్కెట్లు కేవలం కేరళ ప్రాంతం నుండే అమ్ముడుపోయాయట. ఇక్కడ విజయ్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఒక్క ప్రాంతం నుండే ఈ చిత్రానికి మొదటి రోజు 12 లక్షల గ్రాస్ తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట.