Unstoppable with NBK : నందమూరి బాలకృష్ణలోని మరో కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన టాక్ షో అన్ స్టాపబుల్. హయ్యస్ట్ రేటింగ్ లో టాక్ షోలలో టాప్ షో గా అందరి మన్ననలు అందుకుంది. సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకుని మూడో సీజన్ కు రెడీ అయిపోయింది. అప్పటి వరకు నందమూరి బాలకృష్ణ ను హీరోగా, రాజకీయ నాయకుడిగా చూసిన ప్రేక్షకులు ఆయనలో ఉన్న సెన్సాఫ్ హ్యూమర్ ను చూసి తెగ ముచ్చటపడిపోయారు.
ఇప్పటి దాకా వెండితెరకే పరిమితమైన బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షోతో బుల్లి తెరకు దగ్గరయ్యారు. ఈ షోతో చిన్నా, పెద్ద అన్నా తేడా లేకుండా బాలయ్య పేరు మారుమ్రోగిపోయింది. ఈ షో మొదలైనప్పుడు.. బాలయ్య హోస్ట్ అంటే.. అందరూ కొంత ఆశ్చర్యపోయారు. ఆయన చేయగలుగుతాడా… మాట్లాడేటప్పుడే తడబడతాడు.. హోస్టింగ్ అంటే ఎలా ఉంటుందో అని సందేహ పడ్డారు. కానీ.. షో మొదలయ్యాక జనాల అనుమానాలన్నింటినీ బాలయ్య పటాపంచలు చేసేశారు. అన్ స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ చేయడంలో బాలయ్య బాబు సూపర్ సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం అదే జోరుతో సీజన్ 3 చేస్తున్నారు. మూడో సీజన్ ప్రోమోను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. లిమిటెడ్ ఎడిషన్ అన్ లిమిటెడ్ ఫన్ క్యాప్షన్ తో వస్తున్న ఈ సీజన్లో బాలయ్య బాబు తాజా చిత్రం భగవంత్ కేసరి టీమ్ గెస్టులుగా వస్తున్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి, కాజల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్.. తో అన్ స్టాపబుల్ వేదిక కళకళలాడింది. ప్రోమో స్టార్టింగ్ లోనే.. పరోక్షంగా పంచులేస్తూ.. మేము తప్పు చేయలేదు.. మేము ఎవ్వరికీ తల వంచం అని మీకు తెలుసు.. మమ్మల్ని ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు.. అనిపించింది అందాం.. అనుకున్నది చేద్దాం.. ఎవడు ఆపుతాడో చూద్దాం” అంటూ స్టార్ట్ అవుతుంది. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్న మాటలకు బాలయ్య బాబు డబుల్ మీనింగ్ డైలాగ్ వేసి నవ్వులు పూయించాడు. ఆయనను షోలో ఓ ఆట ఆడుకున్నట్లు అనిపిస్తోంది.
తర్వాత హీరోయిన్స్ కాజల్, శ్రీలీల ఎంట్రీ ఇవ్వడం.. కాజల్‌ను మోక్షజ్ఞతో నటిస్తావా అని అడగడంతో తప్పకుండా చేస్తానని చెబుతుంది. బాలయ్య సెన్సాఫ్ హ్యూమర్ తెగనచ్చడంతో.. అనిల్ రావిపూడి.. బాలయ్యతో ఫుల్ లెన్త్ కామెడీ సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. తమన్నాతో అనిల్ రావిపూడి గొడవేంటి అని అడగగా.. మీరు బాలకృష్ణ కాదు పిట్టింగ్ కృష్ణ అంటూ అనిల్ రావిపూడి అన్నారు. ఇక సినిమా, లైఫ్ అంత బావుంది అనుకున్నప్పుడే ఒకడు వస్తాడు నాశనం చేయడానికి.. అప్పుడు హీరో జైలు నుంచి వస్తాడని బాలయ్య అన్న మాటలు పరోక్షంగా చంద్రబాబును ఉద్దేశించి అన్నట్లు అనిపించాయి.. మొత్తానికి ప్రోమో నెట్టింట్లో వైరల్ అవుతోంది.