Shalini Panday : అవును, ప్రస్తుతం ఇవే కామెంట్స్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ షాలినీ పాండే. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో.. ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. షాలినీ పాండే కు అర్జున్ రెడ్డి సినిమా తర్వాత కచ్చితంగా టాప్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. ఆ సినిమాలో ఎంత బోల్డ్ గా నటించిందో మనకు తెలిసిందే. ఆ సినిమా తర్వాత తనకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.

మహానటి సినిమాలో ఓ పాత్ర.. కళ్యాణ్ రామ్ 118 చిత్రంలో నటిచింది. కానీ ఏది తన కెరీర్ కు కలిసి రాలేదు. దీంతో ఆ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాకే పరిమితమైంది.

తాజాగా షాలినీ పాండే ఫ్రెండ్స్ తో నైట్ అవుట్ చేసింది. మస్తుగా ఎంజాయ్ చేసింది. ఫుల్ గా కుమ్మేసి .. రచ్చ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతవరకు ఫర్వాలేదు. కానీ ఓ ఫోటోలో ఈ బోల్డ్ భామ మిడిల్ ఫింగర్ చూపిస్తూ పచ్చి బూతు పదాన్ని ఎక్స్ ప్రెస్ చేసింది. ఓ అమ్మాయి మిడిల్ ఫింగర్ చూపిస్తే అర్థం ఏంటో అందరికీ తెలుసు.. అలాంటి పచ్చి బూతు ఫోటో షేర్ చేసిన నెటిజన్ల చేత పిచ్చి తిట్లు తిట్టించుకుంటుంది ఈ అమ్మడు.