Singer Mangli : జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతి సాంగ్స్ పాడి ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలు పాడి.. సినిమా అవకాశాలు సైతం అందుకుంది. ప్రస్తుతం సినిమాలో ఏ మాస్ సాంగ్ అయినా కూడా మంగ్లీ వైపే చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. అంతలా పేరు తెచ్చుకున్న ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో ఇంకోపక్క ఆల్బమ్స్ తో బిజీగా మారింది. ఇక గత కొన్నిరోజులుగా మంగ్లీ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆమె త్వరలోనే ఒక ఇంటి కోడలు కాబోతుందని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుందని వార్తలు వచ్చాయి. మంగ్లీకి బావ వరుస అయ్యే వ్యక్తితో ఆమె పెళ్లి జరగబోతుందని చెప్పుకువచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం మంగ్లీ అన్ని పనులు పక్కనపెట్టి.. పెళ్లి పనులపైనే నిమగ్నమైందని కూడా వార్తలు వినిపించాయి. ఇక ఈ వార్తలపై మంగ్లీ స్పందించింది. పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకొనేది లేదని ఖరాకండీగా చెప్పుకొచ్చింది.
అసలు నాకు తెలియకుండా నా పెళ్లి ఏంటి అని ఘొల్లున నవ్వింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఏంటి? నాకు పెళ్లా? ఓరి భగవంతుడా.. నాక్కూడా తెలియకుండానే నాకు పెళ్లి చేసేస్తున్నారా?. ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. మా బావతో పెళ్లి అంటూ చెప్పుకొస్తున్నారు.. ఇంతకీ బావతో ఏడడుగులు వేస్తున్నానన్నారు. నాకు తెలియక అడుగుతున్నా.. నాకే తెలియని నా బావ ఎవరో చెప్తారా? ఈ పుకారు సృష్టించినవాళ్లైనా దీనికి సమాధానం చెప్పండయ్యా..” అంటూ సెటైర్లు వేసింది.