మెగా పవర్ స్టార్ Ram Charan కి ఉన్న స్పెషల్ క్వాలిటీ గుర్రపు స్వారీ చెయ్యడం. ఇండియా లో రామ్ చరణ్ రేంజ్ లో గుర్రపు స్వారీ చేసే హీరో లేడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిన్న తనం నుండే ఆయనకీ హార్స్ రైడింగ్ అంటే విపరీతమైన పిచ్చి. ఆ హార్స్ రైడింగ్ మగధీర సినిమాకి ఎంత ప్లస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.

ఈ సినిమా అప్పట్లో అంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ గుర్రపు స్వారీ సన్నివేశాలే. అంతే కాదు చిన్న తనం నుండే ఆయన గుర్రాలను పెంచుకుంటూ ఉండేవాడు. ఈయన దగ్గర కాజల్ అనే గుర్రం కూడా ఉంది. ఇది మగధీర చిత్రం లో ఎడారి సన్నివేశం లో కనిపిస్తుంది. ఈ గుర్రం వేగం ఎవ్వరూ కంట్రోల్ చెయ్యలేని విధంగా ఉంటుందట. దీని మీద స్వారీ చెయ్యడం ఒక సవాలు గా భావించి కొనుగోలు చేసాడు.

ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘బ్లేజ్’ అనే కొత్త గుర్రాన్ని కొనుగోలు చేసాడు. నలుపు రంగులో ఉన్న ఈ గుర్రం చూసేందుకు ఎంతో స్టైలిష్ గా ఉంది. ఈ గుర్రం తో కలిసి ఫోటోలు దిగుతూ రామ్ చరణ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి.
ఇకపోతే ఈ గుర్రం ధర ఎంతో తెలుసుకొని అభిమానులు షాక్ కి గురి అవుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ గుర్రం విలువ మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని. ఈ ధరతో ఒక అందమైన బంగ్లా ని కట్టుకోవచ్చు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్ దగ్గర ఈ ఒక్క గుర్రం మాత్రమే కాదు, ఆయన ఫార్మ్ లో ఇలాంటి గుర్రాలు చాలానే ఉన్నాయి.