Ram Charan : రామ్ చరణ్ దగ్గర ఒక పెట్ డాగ్ ఉంది. అదే రైమ్. రైమ్‌ను ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకుంటుంది మెగా ఫ్యామిలీ. అంతే కాకుండా ‘మగధీర’ సినిమా తర్వాత కొన్ని గుర్రాలను కూడా పెట్స్‌గా తెచ్చిపెంచుకోవడం మొదలుపెట్టాడు చరణ్. తాజాగా తనకు మరో కొత్త ఫ్రెండ్ దొరికిందని రామ్ చరణ్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రామ్ చరణ్ రెండో సినిమా ‘మగధీర’ నుంచి మొదలుపెడితే.. ఆ తర్వాత తను నటించిన దాదాపు అన్ని సినిమాల్లో కచ్చితంగా ఒక గుర్రపు సీక్వెన్స్ ఉంటుంది. మొదట్లో తనకు గుర్రపు స్వారీ భయమేసినా.. మెల్లగా అలవాటు అయిపోయిందని, అంతే కాకుండా గుర్రాలంటే తనకు ఇష్టం పెరిగిందని స్వయంగా రామ్ చరణ్ బయటపెట్టారు. అందుకే గుర్రాలను పెంచుకోవడం, గుర్రపు స్వారీ చేయడం రామ్ చరణ్‌కు ఫేవరెట్ హాబీలుగా మారాయి. తాజాగా ‘బ్లేజ్, నా కొత్త ఫ్రెండ్’ అంటూ ఒక గుర్రంతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు చరణ్.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దర్శకుడు శంకర్.. ఓవైపు ‘భారతీయుడు 2’, మరోవైపు ‘గేమ్ ఛేంజర్’ రెండు షూటింగ్స్‌ను ఒకేసారి మ్యానేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌కు కాస్త బ్రేక్ పడినట్టు అనిపిస్తోంది. ఇదే సమయంలో తన కూతురు క్లిన్ కారాతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం చరణ్‌కు దక్కింది.