Tiger Nageshwara Rao : మాస్ మహారాజా రవితేజ తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’.స్టూవర్టుపురం లో ఉన్న టైగర్ నాగేశ్వర రావు అనే బందిపోటు దొంగ నిజ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు నూతన డైరెక్టర్ వంశీ. రవితేజ లుక్స్ దగ్గర నుండి క్యారక్టర్ వరకు ప్రతీ ఒక్కటి చూసే అభిమానులకు ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా ప్రయత్నం చేసాడు డైరెక్టర్ వంశీ.
కొద్దీ రోజుల క్రితమే విడుదలైన టీజర్ కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కాసేపటి క్రితమే విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబై లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని బలంగా ప్రమోట్ చెయ్యడానికి దర్శక నిర్మాతలు తెగ కష్టపడుతున్నారని అర్థం అవుతుంది.
టీజర్ సినిమా పై అంచనాలు పెంచడం వల్లనో ఏమో తెలియదు కానీ, ట్రైలర్ అంత గొప్పగా అనిపించలేదు. స్టూవర్టుపురం లో అన్యాయానికి గురైన ఒక సాధారణ మనిషి బందిపోటు దొంగగా మారి ఎందుకు దొంగతనాలు చెయ్యాలని అనుకున్నాడు అనే థీమ్ మీద ఈ సినిమా తెరకెక్కింది అనే విషయం అర్థం అవుతుంది. ఇలాంటి సినిమాలను మన చిన్నతనం నుండి చూస్తూనే ఉన్నాము. కానీ టేకింగ్ ఎలా తీశారు అనేదే ముఖ్యమైనది.
సరికొత్త రకమైన స్క్రీన్ ప్లే మరియు టేకింగ్ ఉన్న సినిమాలు కథ రొటీన్ గా అనిపించినా కూడా సూపర్ హిట్ అయ్యిన దాఖలాలు చాలానే ఉన్నాయి. జనాలకు బోర్ కొట్టకుండా సినిమా చూపించడమే పెద్ద టాస్క్. మరి ఈ టాస్కు లో డైరెక్టర్ వంశీ ఎంత వరకు సక్సెస్ అయ్యాడో చూడాలి. యాక్షన్ బ్లాక్స్ మాత్రం రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే విధంగా ఉన్నాయి. సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంటుందో లేదో చూడాలి.