Bigg Boss : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎంత రసవత్తరంగా సాగుతూ ముందుకు దూసుకెళ్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. కంటెస్టెంట్స్ అందరూ మొదటి రోజు నుండే ఎంతో కసిగా ఆడుతూ ఈ షో ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ప్రసారమైన అన్నీ సీజన్స్ లో కంటే ఈ సీజన్ కి అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి అంటే, ఈ సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా పిలవబడే వారిలో ఒకరైన రతికా, అనూహ్యంగా నాలుగు వారాలకే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి రావడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈమె మొదటి వారం లో బాగానే ఆడింది, కచ్చితంగా టాప్ 5 లో ఉంటుంది అని అందరూ అనుకున్నారు.
కానీ ఎప్పుడైతే ఆమె మనుషుల్ని వాడుకొని కన్నింగ్ గేమ్ మొదలు పెట్టిందో అప్పటి నుండే ఆమె ప్రేక్షాధారణ కోల్పోయింది. కొన్ని రోజులు పల్లవి ప్రశాంత్ తో పులిహోర కలిపి అతనిని తన అవసరాలకు వాడుకోవడం, ఆ తర్వాత యావర్ తో ఇలాంటి పులిహోరనే కలిపి అతనికి వెన్నుపోటు పొడవడం వంటివి జనాలు తీసుకోలేకపోయారు.ఇక ఆమె ఉన్న చివరి వారం లో పల్లవి ప్రశాంత్ ని అన్న మాటలు చూస్తే ఆమెని అభినించే వారు కూడా అసహ్యించుకుంటారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె బిగ్ బాస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ ని గీతూ రాయల్ హోస్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఇంటర్వ్యూ లో గీతూ మాట్లాడుతూ ‘ఇంట్లో ఉన్న మనుషుల్ని, ఆఖరికి నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని కూడా నీ ఆట కోసం వాడుకున్నావు’ అని అంటుంది. అప్పుడు రతికా ‘అలా వాడుకోవాలి అనుకుంటే సందర్భానికి తగ్గట్టుగా వాడుకునే దానిని, కానీ ఆ ఛాన్స్ కూడా లేకుండా బయటకి వచ్చేసాను’ అంటూ చెప్పుకొచ్చింది.