Bigg Boss Telugu నుండి తేజా సేఫ్.. రతికా అవుట్.. ఉత్కంఠ నడుమ సాగిన ఎలిమినేషన్స్!

- Advertisement -

Bigg Boss Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌస్ ఎంత రసవత్తరంగా సాగిందో మన అందరికీ తెలిసిందే. మొదటి వారం నుండి అద్భుతమైన టాస్కులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. గత వారం లో దామిని హౌస్ నుండి ఎలిమినేట్ కాగా, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి తేజా , యావర్, గౌతమ్, రతికా, ప్రియాంక మరియు శుభ శ్రీ నామినేట్ అయ్యారు.

Bigg Boss Telugu
Bigg Boss Telugu

వీరిలో అందరికంటే అత్యధిక ఓట్లను దక్కించుకున్న కంటెస్టెంట్ యావర్. ప్రతీ వారం టాస్కులలో ఇతను పడే కష్టం ఎవరూ పడరు. అందుకే ఈ స్థాయికి వచ్చాడు, అతని తర్వాత గౌతమ్ అత్యధిక ఓట్లను దక్కించుకొని రెండవ స్థానం లో నిలిచాడు. ఇక అందరికంటే తక్కువ ఓట్లను దక్కించుకొని తేజా మరియు రతికా చివరి రెండు స్థానాల్లో ఉన్నారు.

వీళ్ళిద్దరిలో కచ్చితంగా తేజా ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గౌతమ్ ని బెల్ట్ తో మెడ మీద కొట్టి అంత బాడ్ గా ప్రాజెక్ట్ అయ్యాడు. కానీ అతని కంటే రతికా ఇంకా నెగటివ్ అయ్యింది. ఈమె ఆడే కన్నింగ్ ఆటలను చూసి జనాలు విసుగెత్తిపోయారు. మొదటి వారం లో టాస్కులు ఎంత చక్కగా ఆడిందో, నాల్గవ వారం లో టాస్కులు అంత చెత్తగా ఆడింది.

- Advertisement -
Rithika SIngh

అందుకే టాప్ 5 లో ఉంటుంది అనుకున్న ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఈ నాలుగు వారాలు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గాను సుమారుగా నాలుగు లక్షల రూపాయిల పారితోషికం ని గెల్చుకుంది. ఈమెకి కచ్చితంగా టాప్ 5 లో నిల్చేంత కెపాసిటీ అయితే ఉంది. కానీ నోటికి హద్దు అదుపు లేకపోవడం, పల్లవి ప్రశాంత్ ని పదే పదే టార్గెట్ చెయ్యడం ఈమెపై జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడేలా చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here