Janhvi Kapoor : నెట్ లో ప్రత్యక్షమైన జాన్వీకపూర్ అశ్లీల ఫొటోలు.. షాకయ్యానంటూ అసలు కారణం తెలిపిన భామ

- Advertisement -

Janhvi Kapoor : ప్రెజెంట్ జెనరేషన్ లో సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిపోయింది. దానివల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియా వల్ల తన లైఫ్ లో ఎదురైనా చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. ఇటీవల ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆమె.. సోషల్ మీడియా ప్రభావం తనపై ఎలాంటి ప్రభావం చూపించిందో వివరించింది.

Janhvi Kapoor

నేను సినిమా ఇండస్ట్రీకి చెందిన కుటుంబంనుండి వచ్చాను కాబట్టి స్కూల్ దశ నుండే నా చుట్టూ ఫొటో గ్రాఫర్లు ఉండేవారు. ఎక్కడికైనా వెళ్లాలంటే భయమేసేది. పర్మిషన్ లేకుండా వెంటపడి ఫొటోలు తీసేవారు. ఒకసారి మా స్కూల్ ముందు కెమెరాలు పట్టుకుని వెయిట్ చేస్తున్న వారిపై నేను సీరియస్ అయ్యాను. అందుకు ప్రతీకారంగా నా ఫొటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. దానివల్ల చాలామంది పిల్లలు కొంతకాలం నాతో డిస్టెన్స్ మెయింటెన్ చేశారు.

janhvi kapoor

నా ఫ్రెండ్స్ నన్ను ఎగతాళిగా మాట్లాడేవారు. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను.. అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.. ‘‘టెక్నాలజీ వృద్ధి చెందుతోన్న ఈ రోజుల్లో మార్ఫింగ్, ఫేక్‌ ఫొటోలు ఎక్కువవుతున్నాయి. మార్ఫింగ్‌ ఫొటోలు చూసి.. అవి నిజమేనని కొంతమంది అనుకుంటున్నారు. ఆ విషయం నన్నెంతో బాధపెడుతోంది. టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి.. అశ్లీల వెబ్‌సైట్స్‌లో ఉపయోగించారు. విషయం తెలిసి నేను కంగారుపడ్డా’’ అని ఆమె చెప్పారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here