Chiranjeevi : వామ్మో.. చిరంజీవి, శ్రీదేవిలు అప్పట్లోనే ఇంత రెమ్యునరేషన్ తీసుకునేవాళ్లా.. సాక్ష్యాలతో సహా చెప్పిన రచయిత..

- Advertisement -

Chiranjeevi : ప్రస్తుతం కోట్లలో పారితోషకం తీసుకుంటున్న చిరంజీవి రెమ్యునరేషన్ ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేదట. ఇదే విషయాన్ని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పుడు హీరోలకు ఇచ్చేంత రెమ్యునరేషన్ ఒకప్పుడు ఉండేవి కావని, వాటాలు కూడా లేవని వేలల్లో మాత్రమే రెమ్యూనరేషన్ ఇచ్చే వారిని ఈ సందర్భంగా పేర్కొన్నారు వీరేంద్రనాథ్.

Chiranjeevi
Chiranjeevi

“నేను రచయితగా పనిచేస్తున్నప్పుడు ఒక సమయంలో ఒకే డైరెక్టర్ తో మాత్రమే పని చేశాను. అలా కోదండరామిరెడ్డి గారితో ఒకే సమయంలో 8కి పైగా సినిమాలు చేశాను. అప్పట్లో రెమ్యునరేషన్స్ మాత్రమే ఇచ్చేవారు. సినిమాకి వాటాలు తీసుకునే అవకాశం లేదు. నాకు అభిలాష సినిమాకు రూ.20,000 ఇస్తే ‘స్టువర్టుపురం పోలీస్ స్టేషన్’ సినిమాకు డైలాగ్, స్క్రిప్ట్, స్టోరీ, డైరెక్షన్ కలిపి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చారు. అప్పట్లో రెమ్యూనరేషన్స్ పెద్ద మొత్తంలో ఉండేవి కాదు. కమల్ హాసన్, శ్రీదేవి లాంటి యాక్టర్స్ కి అప్పట్లో రెండు లక్షలు ఇచ్చారు.

అంతకంటే ఎక్కువ ఇచ్చేవారు కాదు. అలాగే నా సినీ కెరియర్లో నేను ఎంతో మంది డైరెక్టర్స్ తో ప్రొడ్యూసర్స్ తో జర్నీ చేశాను. నా జర్నీలో సినిమాల్లో పార్ట్నర్ షిప్స్, ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న వాళ్ళు అయితే ఎవరూ లేరు. ఒకటి నవ్వుతూ ఉండాలి. నా వాళ్ళు బాగుండాలి, నేనే బాగుండాలనే తాపత్రయం ఉండకూడదు. రెండోది మనం కంఫర్టబుల్‌గా బతకడానికి వీలైనంత డబ్బు ఉండాలి. నేను వ్యక్తిత్వ వికాస పాటలు బోధించడం వల్ల కోపం పూర్తిగా తగ్గిపోయింది. నేను కోప్పడి దాదాపు 15 ఏళ్ల అవుతుంది. ఓసారి సింగపూర్లో నా కొడుకు, కోడలు నుంచి తప్పిపోయాను. నా దగ్గర పాస్ పోర్ట్ లేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. అప్పుడు ఓ తెలుగు వ్యక్తిని సహాయం అడిగాను” అని తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here