Venkatesh : ముఖ్యంగా సినిమా వాళ్లకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా తెలుసుకునేందుకు జనాలు క్యూరియాసిటీ చూపిస్తున్నారు. వారి పెళ్లిళ్లు, పుట్టిన రోజులు, పిల్లల పుట్టుక ఇలాంటివి జనాలకు చాలా ఇంట్రెస్ట్. ఇక వారి భార్యభర్తలను, పిల్లలను సెలబ్రిటీస్ ఎక్కువగా సోషల్ మీడియాలో.. పబ్లిక్ ప్లాట్ ఫాంలలో ఎక్కువగా చూపించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే చాలా తక్కువ మంది హీరోహీరోయిన్లు మాత్రమే వారి లైఫ్ పార్టనర్ ను ఎవరికీ తెలియకుండా ప్రైవేట్ గా ఉంచుకుంటారు. తమ ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఆ జాబితాలో ముందుంటాడు హీరో వెంకటేష్. ఆయన తన భార్యతో పబ్లిక్ ప్లేసులలో కనిపించింది చాలా తక్కువ. చాలా కాలం వరకు ప్రజలకు అసలు ఆయనకు పెళ్లి అయిందన్న విషయం కూడా తెలియదు. దీంతో చాలా మంది ఆయననను అపార్థం చేసుకున్నారు.
అంతలా వెంకటేష్ తన ఫ్యామిలీని చాలా రెస్ట్రిక్షన్స్ లో పెట్టేస్తుంటారు. ఇప్పుడిప్పుడే ఆయన ఫ్యామిలీకి సంబంధించి కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి. అయితే ఇది చాలా వరకు తప్పంటూ అప్పట్లో వెంకటేష్ ను చాలామంది ఫ్యాన్స్ తిట్టిపోశారు. ప్రతి భార్యకు భర్తతో బయట ప్రపంచంలో తిరగాలని ఉంటుంది. నలుగురిలో కలవాలి అని ఉంటుంది. ఇలా వెంకటేష్ తన భార్యను నాలుగు గోడల మధ్య పెట్టి.. కేవలం ఫ్యామిలీ ఫంక్షన్స్ వరకే రిస్ట్రిక్ట్ చేస్తే ఎలా అంటూ ఆయన అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె కూడా నాలుగు ఫంక్షన్లకు వెళుతూ ఉంటే వెంకటేష్ భార్య హో.. ఈమెనా అని మాకు తెలుస్తుందంటూ.. కామెంట్ చేస్తున్నారు. అయితే వెంకటేష్ తన భార్య ఫోటోలే కాదు పిల్లల ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంటాడు.