Pavitra Naresh : నరేష్ మూడు పెళ్లిళ్ల బ్రేకప్ వెనుక అసలు రహస్యం ఇదే…!

- Advertisement -

Pavitra Naresh : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. నరేష్ -పవిత్ర లోకేష్ గురించే. వీరిద్దరూ మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ఆలయంలో కనిపించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. చివరికి నిన్నటి రోజున నూతన సంవత్సరం.. సరికొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాము అంటూ ఒక వీడియోని విడుదల చేయడం కూడా జరిగింది. త్వరలోనే మా పెళ్లి డేట్ ని ప్రకటిస్తామంటూ కూడా బాంబు పేల్చారు. అయితే పవిత్ర లోకేష్ తో నరేష్ కు ఇది నాలుగో వివాహం. మరి నరేష్ ముగ్గురు భార్యలు ఎందుకు విడిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం.

నరేష్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. 17 ఏళ్లకే హీరోగా పరిశ్రమలో అడుగు పెట్టాను.. 19 ఏళ్లకే తనకు తమ ఇంట్లో పెళ్లి చేశారని దాంతో తనకి మెచ్యూరిటీ తెలియక ఆమె అనారోగ్యం కారణంగానే విడిపోవలసి వచ్చిందని తెలియజేశారు. ఇక తర్వాత రెండో వివాహం చేసుకున్నాను. కానీ కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయామని తెలియజేశారు. ఇక మూడవ భార్య వల్ల పలు అవమానాలు, నిందలు మోయడం వల్లే మా ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోవలసి వచ్చిందని తెలియజేశారు.

pavitra naresh
pavitra naresh

ఇక నరేష్ మొదటి భార్య ఎవరో కాదు సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తె నట. వీరిద్దరికి ఒక అబ్బాయి కూడా ఉన్నారట. అతని పేరు నవీన్ విజయకృష్ణ. హీరోగా ఒక మూవీ కూడా చేశారని తెలిపారు నరేష్. ఇక తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలిని రెండవ వివాహం చేసుకున్నారట. వీరికి కూడా ఒక కొడుకు ఉన్నారట. అతడు పెయింటింగ్ ఆర్టిస్ట్ అని తెలిపారు నరేష్. ఇక మూడవ భార్య కాంగ్రెస్ సీనియర్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడి కూతురు రమ్య రఘుపతిని వివాహం చేసుకున్నారు. వీరికి కూడా ఒక అబ్బాయి ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం నరేష్ ,పవిత్ర లోకేష్ వివాహం చేసుకోబోతున్నట్లుగా నిన్నటి రోజున తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here