Venkatesh : టాలీవుడ్ అగ్రహీరోల్లో వెంకటేష్ ఒకరు. ఆయన సినిమాలంటే చిన్నోళ్ల దగ్గర్నుంచి ముసలోళ్ల వరకు ఇష్టపడుతారు. తన కెరీర్లో దాదాపు 70శాతం సక్సెస్ సాధించిన సినిమాలే ఉన్నాయి. దీంతో విక్టరీనే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. ఆయను ఏ క్యారెక్టర్ చేసినా అందులో జీవించేస్తుంటారు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఇలా ఏది చేసినా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తారు. తనకు ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఎక్కువ. వారిలో ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే హీరోకు లేదు. తాను వ్యక్తిగతంగా చాలా కూల్.. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోతో క్లోజ్ గా ఉంటారు. అలాంటి వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వెంకటేష్ ఓ టైంలో తన చెల్లి కోసం నాగార్జునతో గొడవకు వెళ్లాడట. నిజానికి వెంకటేష్ చెల్లెలు దగ్గుబాటి లక్ష్మిని.. తొలుత నాగార్జున పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వర్ రావు, మూవీ మొఘల్ రామానాయుడు మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేది. దాని కారణంగా నాగార్జునకు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడు రామానాయుడు. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన పెళ్లి. కానీ.. కొంత కాలం ఇద్దరు అన్యోన్యంగానే ఉన్నారు. నాగచైతన్య పుట్టిన తరువాత వారి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు కోరుకున్నారు. విడిపోవాలనుకున్న వారిద్దరినీ కలపాలని వెంకటేష్ చాలా ప్రయత్నించాడట. ఇక లక్ష్మీకి కలవాలని ఉన్నప్పటికీ నాగార్జునకు మాత్రం ఇష్టం లేదట. ఆయన అప్పటికే హీరోయిన్ అమలతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ ఆగ్రహంలో నాగార్జునతో కొట్లాటకు వెళ్లాడట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.