Big Boss : ఎప్పటి నుంచో అనుకుంటున్న రచ్చ మొదలు పెట్టిన బిగ్ బాస్.. గుండు టాస్క్ ఇచ్చేశాడు..

- Advertisement -

Big Boss : పవన్ అస్త్ర కోసం బిగ్ బాస్ ఎంపిక చేసిన కంటెస్టెంట్లకు, వారిని వ్యతిరేకించిన ఇతర కంటెస్టెంట్లకు మధ్య ‘బిగ్ బాస్’ టాస్కులు పెడుతున్నాడు. ఇప్పటికే యావర్.. ఒక టాస్క్ గెలిచి పవర్ అస్త్రా పోటీకి సిద్ధమయ్యాడు. శోభాశెట్టి కూడా స్పైసీ చికెన్ టాస్క్‌లో శోభ, గౌతమ్, పల్లవి ప్రశాంత్‌లతో పోటీపడింది. ఆమే ఈ టాస్కులో గెలిచినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు పవర్ అస్త్ర పోటీకి సిద్దమైన నేపథ్యంలో అమర్ దీప్ వంతు వచ్చింది.

amar deep palavi prashanth

అయితే, ఎవరూ ఊహించని టాస్క్ ఇచ్చి ‘బిగ్ బాస్’ అమర్ దీప్‌ను ఇరకాటంలో పెట్టేశాడు. ఈ వారం పవర్ అస్త్ర కోసం ‘బిగ్ బాస్’ అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టిలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారు పవర్ అస్త్ర పోటీకి అర్హులు కాదు అనడానికి కారణాలు చెప్పాలంటూ ‘బిగ్ బాస్’ ఫిట్టింగ్ పెట్టాడు. శోభా శెట్టి, అమర్ దీప్‌లో టాస్క్‌లను ఎదుర్కోనున్నారు. శోభ శెట్టికి కారంతో ఉన్న చికెన్‌ తినే టాస్క్ ఇచ్చాడు ‘బిగ్ బాస్’. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్, శోభ, గౌతమ్‌లకు కూడా అదే టాస్క్ ఇచ్చాడు.

ఇక అమర్ దీప్, ప్రియాంకల విషయానికి వస్తే.. జుట్టును త్యాగం చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. పవర్ అస్త్రకు తాము అర్హులమని భావిస్తే.. జుట్టు కత్తిరించుకోవాలని మెలిక పెట్టాడు. దీని ప్రకారం ప్రియాంక చెవుల వరకు జుట్టును కత్తిరించుకోవాలి. ఇక అమర్ అయితే దాదాపు గుండు చెయ్యించుకోవాలి. ట్రిమ్మర్‌తో 3 మిల్లీ మీటర్ల వరకు మాత్రమే జుట్టు ఉండేలా జుట్టును కత్తిరించుకోవాలి. దీంతో ప్రియాంక తాను అందుకే సిద్ధమేనని చెప్పేసింది. అమర్ మాత్రం వెనకడుగు వేస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here