Nagarjuna : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా ప్రేక్షకులను మెప్పించినవారే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. కొందరు సక్సెస్ అయ్యారు కూడా. ఇప్పుడు ఆ లిస్ట్‌లో యానీ కూడా జాయిన్ అవ్వనుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా యానీ చేసింది తక్కువ సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. అందులో ‘రాజన్న’ ఒకటి. ‘రాజన్న’ చిత్రంలో యానీ చేసిన మల్లమ్మ పాత్ర.. చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్స్‌లోనే ఒక ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయింది.
ఇప్పుడు హీరోయిన్గా మారిన యానీ.. ‘రాజన్న’ సినీ విశేషాలను గుర్తుచేసుకుంది. యానీ అందుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తనకు గుర్తులేదని, ఒకసారి తన అమ్మను అడగగా.. రూ.500 లేదా రూ.1000 అని చెప్పారని చెప్పింది. ‘అనుకోకుండా ఒకరోజు’ కంటే ముందు తను ఒక యాడ్‌లో నటించిందని, అప్పుడే తన ఫస్ట్ రెమ్యునరేషన్ అందుకున్నానని అంటోంది. చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల స్కూల్లో ఇబ్బంది పడ్డానని గుర్తుచేసుకుంది. అందరూ యాటిట్యూడ్ అనుకోకుండా ఉండాలని నవ్వు రాకపోయినా నవ్వేదాన్ని అని చెప్పింది.
ఇక ‘రాజన్న’ సినిమా సమయంలో యానీ.. నాగార్జునకు చాలా నచ్చడంతో తనను ఇంటికి తీసుకెళ్లిపోతానని, దత్తత తీసుకుంటానని.. వాళ్ల అమ్మను అడిగినట్టుగా బయటపెట్టింది. ‘రాజన్న’ చిత్రాన్ని రాజమౌళి కూడా కొంతవరకు డైరెక్ట్ చేశారు. అలా ఆయన డైరెక్షన్లో కూడా 2, 3 సీన్స్ చేశానని చెప్పింది. ‘లూజర్ (Loser)’ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో నాగార్జునను పదేళ్ల తర్వాత కలిసానని, ముందు గుర్తుపట్టకపోయినా తర్వాత ఆయనే గుర్తుపట్టి మాట్లాడారని చెప్తూ సంతోషపడింది యానీ.