2023 SIIMA Awards: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా సత్తా చాటింది. ఈ సినిమాకు ఏకంగా ఐదు అవార్డులు వచ్చాయి. హీరో నుండి డైరెక్టర్ మ్యూజిక్, డైరెక్టర్ వరకు అవార్డులు అందుకున్నారు. ఇక 2023 సైమా అవార్డ్స్ లో ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ కు అవార్డ్ వచ్చింది. అలాగే ఉత్తమ విలన్ గా హీరో కమ్ యాక్టర్ సుహాస్ ని వరించింది. ఈయన హిట్ 2 సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో చేశారు. ఉత్తమ నటిగా రవితేజతో ధమాకా సినిమాలో చేసిన హీరోయిన్ శ్రీలీల ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి , ఉత్తమసంగీత దర్శకుడిగా కీరవాణికి అవార్డులు వచ్చాయి. అలాగే ఉత్తమ సాహిత్యం అవార్డు చంద్రబోస్ను అవార్డు వరించింది. ఉత్తమ సినిమా కేటగిరీలో సీతారామం సినిమా అవార్డు సాధించింది. ఇక బెస్ట్ డెబ్యు హీరోయిన్ గా సీతారామంలో నటించిన మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది. క్రిటిక్స్ నుండి ఉత్తమ నటుడి అవార్డు మేజర్ సినిమాలోని నటనకు గాను అడవి శేష్ అందుకున్నాడు. అంతేకాదు సీతారామంలోని తన నటనకి క్రిటిక్స్ నుండి సైతం సీతారామ సినిమా నుండి ఉత్తమ నటిగా మృణాల్ ఠాకూర్ ని అవార్డు వరించింది.
ఉత్తమ ఛాయాగ్రహకుడి అవార్డు సెంథిల్ కుమార్ (ఆర్ఆర్ఆర్)కి వచ్చింది. సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ గా కార్తికేయ 2 చిత్రానికి అవార్డు దక్కింది. ఉత్తమ సహాయనటి గా మసూద సినిమాలో నటించిన సంగీతకు అవార్డు లభించింది. ఇక ఉత్తమ సహాయ నటుడిగా భీమ్లా నాయక్ సినిమాలో చేసిన రానాను అవార్డు వరించింది. ఉత్తమ కమెడియన్ గా కార్తికేయ 2 సినిమాలో నటించిన శ్రీనివాస్ రెడ్డికి అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ డెబ్యు హీరోగా అశోక్ గల్లా ‘హీరో’ సినిమాకి వచ్చింది. ఇక వీళ్ళకే కాకుండా ప్రామిసింగ్ స్టార్ గా బెల్లంకొండ గణేష్ కి, అలాగే యూత్ ఐకాన్ గా నటి శృతిహాసన్ లను అవార్డులు వరించాయి. అలాగే సింగర్ మంగ్లీ, రామ్ మిరియాలకు కూడా అవార్డ్స్ వచ్చాయి. ఇక కన్నడలో కాంతార సినిమాకు అవార్డుల పంట పండింది.