హౌస్ లో మొదటి వారం లవ్ ట్రాక్ వల్ల ప్రశాంత్ పేరు బాగా వినిపించింది, ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేయడంతో ఆడియన్స్ అంతా ప్రశాంత్ పై సింపతి చూపిస్తున్నారు. బయట ఇతనికి ఈ రేంజ్ లో సపోర్ట్ వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఇప్పుడు ఈ రైతుబిడ్డ బయట ఓ బ్రాండ్ అయిపోయాడు. పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రశాంతి తల్లి మాట్లాడుతూ.. ప్రశాంత్ బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాక పెళ్లి చేస్తామని తెలిపారు. ఈరోజు తన కొడుకు బిగ్ బాస్ లోకి వెళ్లడానికి ఎంతోమంది సపోర్ట్ చేశారని, అందరూ సపోర్ట్ చేయడం వల్ల తన కొడుకు ఇప్పుడు హౌస్ లో ఉన్నాడని పేర్కొన్నారు. హౌస్ లో రతికతో కలిసి ఉంటున్నాడు. కలిసి తింటున్నాడు. దాని గురించి ఏమంటారని అడిగితే.. “ఆమె మా కొడుకుని వాడుకుంది. నేను పల్లవి ప్రశాంత్‌తో ఉంటే ఆయనకు వచ్చే ఓట్లు కూడా నాకు వస్తాయని వాడుకుంది. అంతే తప్ప వేరే ఏం లేదు.
మా కొడుకు కూడా అందరిని అక్కా, చెల్లె అనే ఉద్దేశంతోనే చూస్తాడు. ఇక ఇంట్లో ఎలా ఉంటున్నాడో హౌస్ లో కూడా అలాగే ఉంటున్నాడు. ఎటువంటి మార్పు లేదు. మా కొడుకు బిగ్ బాస్ లో గెలిచినా, గెలవకున్నా అక్కడిదాకా వెళ్లి నాగార్జున సార్ ని కలవడం అదే మాకు గొప్ప.ఇక బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత కచ్చితంగా మా కొడుకుకి పెళ్లి చేస్తాం” అని ప్రశాంత్ తల్లి చెప్పింది.