బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వగానే ముందుగా రతిక, పల్లవి ప్రశాంత్‌ల మధ్య ప్రేమ చిగురించింది అన్నట్టుగా ప్రవర్తించారు. పల్లవి ప్రశాంత్ చూపిస్తున్న ప్రేమ.. రతికకు కూడా ఇష్టమే అన్నట్టుగా ప్రవర్తించినా.. ఒక్కసారిగా తాజాగా జరిగిన నామనేషన్స్‌లో ప్రశాంత్ మీద రివర్స్ అయ్యి అందరినీ షాక్‌కు గురిచేసింది.
రెండోవారం నామినేషన్స్ తర్వాత నుండి రతిక, పల్లవి ప్రశాంత్ మధ్య మాటలు లేవు. ఇక తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్లో రతిక, ప్రిన్స్ యావర్ ప్రేమగా మాట్లాడుకోవడం చూసి పల్లవి ప్రశాంత్ రియాక్ట్ అయ్యాడు. మాయాస్త్రం గురించి వాగ్వాదాలు అన్ని ముగిసిన తర్వాత రతిక, యావర్ ప్రేమగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ‘బిగ్ బాస్ నేను రతిను ఇష్టపడుతున్నాను’ అంటూ రతికకు ఐ లైక్ యూ కూడా చెప్పాడు యావర్. దానికి ‘ఐ లైక్ యూ టూ’ అంటూ సమాధానం కూడా ఇచ్చింది రతిక.
ఆ తర్వాత ‘నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది’ అన్నట్టుగా సైగ చేసి చూపించాడు యావర్. ఇదంతా పల్లవి ప్రశాంత్ దగ్గర ఉండి గమనించాడు. యావర్, పల్లవి ప్రశాంత్ మాత్రమే ఉన్నప్పుడు ‘నీకు రతిక అంటే ఇష్టం కదా’ అని యావర్‌ను ప్రశ్నించాడు ప్రశాంత్. ‘అంటే తనకు మంచి మనసు ఉందని నాకు అనిపిస్తుంది’ అంటూ సమాధానమిచ్చాడు యావర్. ‘అదంతా నమ్మకు రా నాయనా’ అంటూ యావర్‌కు సలహా ఇచ్చాడు ప్రశాంత్.