అనుష్క గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తాను తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత అనుష్క శెట్టి కెరీర్లో మొదటి సారి మలయాళంలో ఓ సినిమా చేస్తుంది. దాంట్లో విలన్ పాత్రలో నటించబోతోంది అంటూ ఈ చిత్రం గ్లింప్స్ ద్వారా ప్రకటించింది చిత్ర బృందం. జేజమ్మకు 40ఏళ్లు దాటుతున్న ఇంకా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికి పెళ్లికి సంబంధించి ఏమైనా శుభవార్త చెబుతుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనుష్క. గతంలో ప్రభాస్, అనుష్క మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అందుకే వీరిద్దరూ ఇంకా పెళ్లికి దూరంగా ఉన్నారన్న వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో అనుష్క, ప్రభాస్ పెళ్లి ఖాయం అయినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ అనుష్క చేసిన ఒక తప్పు వల్లే ప్రభాస్ తనను దూరం పెట్టారని వార్తలు వినిపించాయి. ఇది ఇలా ఉంటే అనుష్క ఇప్పటికే హీరో గోపీచంద్, ప్రభాస్, ప్రకాష్ కోవెలమూడి వంటి వారితో ఎఫైర్ ఉన్నట్లుగా పుకార్లు వచ్చాయి.

కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే తనకు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కూడా ఎఫైర్ ఉందంటూ పలు రూమర్స్ వినిపించాయి. ఒకానొక సమయంలో దిల్ రాజు మొదటి భార్య చనిపోయిన తర్వాత అప్పుడు అనుష్కను రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్ వినిపించింది. ఈ విషయం పై ఏకంగా మీడియా వాళ్లు అనుష్క గురించి దిల్ రాజును ప్రశ్నించగా.. మీరు నిజంగానే అనుష్క తో హోటల్ రూములో దొరికిపోయారా.. మీ మధ్య ఎఫైర్ ఎన్ని రోజుల నుంచి సాగుతోంది అని అడగగా దీనికి దిల్ రాజు ఫైర్ అయ్యారు. మీకు ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకు వస్తాయి. అనుష్కతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయవద్దంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్త వైరల్ కావడంతోనే ప్రభాస్ అనుష్కల పెళ్లి క్యాన్సిల్ అయిందని ఓ న్యూస్ వినిపించింది.
