టాలీవుడ్ దర్శకులంతా నా ప్రైవేటు పార్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు.. ఏకిపారేసిన ఇలియానా

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా రామ్ పోతినేని హీరో గా నటించిన దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఇలియానా ఆ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా నటించిబ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ భామ ఈ మధ్య కాస్త లావు పెరగడంతో ఈ భామకు ఆవకాశాలు అడుగంటాయి.ఇలా కెరియర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇలియానా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంది.

Ileana
Ileana

ఆ మధ్య తాను ప్రెగ్నెంట్ అనే బాంబు పేల్చి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలియానా పెళ్లి చేసుకుందా లేదా అన్న విషయాన్ని ఇప్పటికే రహస్యంగానే ఉంచారు. అయితే ఈమె మాత్రం ప్రెగ్నెంట్ కావడం కొడుకుకు జన్మనీవ్వడం కూడా జరిగిపోయింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ ఫోటో కూడా రివీల్ చేసిన ఇలియానా తన గురించి ఎలాంటి విషయాలను కూడా మాత్రం అభిమానులకు తెలియజేయలేదు.ప్రస్తుతం కొడుకు బాధ్యతలు చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంది ఇలియానా. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో భాగంగా టాలీవుడ్ డైరెక్టర్ల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి డైరెక్షన్లో మీరు నటించారు.

అయితే ఏ డైరెక్టర్ కూడా మీకు సరైన గుర్తింపు ఇచ్చే పాత్ర ఇవ్వలేదా అంటూ ఇలియానా ను ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ తాను ఎలాంటి పాత్రలోనైనా ఎంతో అద్భుతంగా నటిస్తాను కానీ తెలుగు సినిమా డైరెక్టర్లు అందరూ కూడా తనలో నటన కన్నా కూడా నా నడుము ఎన్ని యాంగిల్స్ లో చూపించాలి అనే దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు.వాళ్ళకి ఎప్పుడు నా సన్నని నడుము మీదే దృష్టి ఉంటుంది అంటూ తెలుగు డైరెక్టర్లపై ఇలియానా షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here