ఏ ఇండస్ట్రీ లో అయినా ఒక హీరో, హీరోయిన్ ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణం. కానీ పెళ్లి తర్వాత కలకాలం జీవితం మొత్తం సుఖం గా ఉన్న సెలబ్రిటీ దంపుతులు మాత్రం ఈమధ్య కాలం లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. పెళ్ళైన రెండు మూడు నెలలకే విడిపోతున్నారు. వాళ్లకి పెళ్లి అనే వ్యవస్థ అంటే అవహేళనగా మారిపోయింది. ఈ జాబితాలో అక్కినేని కుటుంబ సభ్యుడు సుమంత్ కూడా ఉన్నాడు.
ఈయన ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2004 వ సంవత్సరం లో పెద్దల సమక్ష్యం లో పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరు, 2006 వ సంవత్సరం లో కొన్ని అనుకోని సంఘటనలు ఏర్పడడం వాళ్ళ విడిపోవాల్సి వచ్చింది.అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సుమంత్ కీర్తి రెడ్డి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
సుమంత్ తో కీర్తి రెడ్డి విడిపోయిన తర్వాత ఆమె కొన్ని రోజులకు బెంగళూరు కి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకుందట. ఆ అబ్బాయి మరియు అతని కుటుంబం చాలా మంచిది అని, ఇప్పుడు ప్రస్తుతం ఆమె బెంగళూరు లోనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు సుమంత్. విడాకులు తీసుకున్న తర్వాత కూడా సుమంత్ ఇప్పటికీ ప్రతీరోజు కీర్తి రెడ్డి తో ఫోన్ కాల్స్ మరియు చాటింగ్స్ వంటివి చేస్తూనే ఉంటాడట.
ఇలా వీళ్లిద్దరు ఉన్నంత ఓపెన్ మైండ్ సెట్ తో ప్రపంచం లో ఎవ్వరూ ఉండరు అనుకుంట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి రెడ్డి సుమంత్ ని పెళ్లాడిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇప్పటి వరకు ఆమె కనీసం మీడియా కి కూడా కనిపించలేదు. ఇక సుమంత్ ఒకపక్క హీరో గా చేస్తూనే, మరోపక్క ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ ముందుకెళ్తున్నాడు.