కొన్నేళ్లుగా బాలీవుడ్ బాద్ షా హిట్ లేక రేసులో వెనుకబడ్డారు. ఆ సమయంలోనే వచ్చిన పఠాన్ సినిమా షారూఖ్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీసు వద్ద రూ.1000కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసి షారూఖ్ ను కమ్ బ్యాక్ తెచ్చింది. ఆ సినిమా ఇచ్చిన జోష్ లో తన తర్వాత సినిమా కూడా గ్రాండ్ సక్సెస్ కావాలన్న కసితో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా జవాన్. మరి కాసేపట్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే థియేటర్స్ వద్ద షారుఖ్ ఖాన్ భారీ కటౌట్ ఫ్లెక్సీలతో ఆయన ఫ్యాన్స్ నానా హంగామా సృష్టిస్తున్నారు. భారీ భారీ పూలదండలు పాలాభిషేకాలతో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. పఠాన్ సినిమా తర్వాత మరోసారి సినీ ఇండస్ట్రీలో చెరగని రికార్డును నెలకొల్పడానికి జవాన్ రెడీగా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి క్రమంలోనే షారూఖ్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతుందన్న కొద్ది గంటల ముందు ఎప్పుడూ లేని విధంగా తన ఇష్టదైవం అల్లాకు నమాజ్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. అవును వాస్తవానికి షారుక్ ఎప్పుడూ కూడా తన సినిమా విడుదల సమయంలో ఏ దేవుడిని కూడా ఈ సినిమా హిట్ చేయించమని అడగడం ఇప్పటి వరకు జరుగలేదు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం తన రూల్స్ మొత్తం బ్రేక్ చేశారు. అంతేకాదు విశేషమేమిటంటే ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ తిరుమలకు వెళ్లింది లేదు. కానీ ఈ సినిమా కోసం మొదటి సారి షారూఖ్ ఈ సినిమా కోసం తిరుమలకు వెళ్లి ఏడుకొండల వాడిని దర్శించుకున్నారు. ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని షారూఖ్ ప్రత్యేక పూజలు కూడా చేయించారట. దీంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం పడుతున్న తాపత్రయానికి షాక్ అయిపోతున్నారు. బాద్ షా నువ్వు అంత పెద్ద హీరో అయి ఉండి ఈ సినిమాకు ఎందుకు ఇంత టెన్షన్ తీసుకుంటున్నావంటూ కామెంట్స్ చేస్తున్నారట.