అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. వరుసగా హిట్స్ ఇస్తూ టాలీవుడ్ రౌడీ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. తన గత చిత్రం లైగర్ తో భారీ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తీశారు. ప్రస్తుతం ఆయన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్లను తన భుజాలపై వేసుకుని ఫుల్ బిజీగా ఉన్నాడు. హీరోయిన్ గా నటించిన సమంత ప్రస్తుతం అమెరికాలో ఉండడంతో ఆయన ఒక్కడే సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
విజయ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్స్ అంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ క్రమంలో సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నాడు. పెళ్లి ఈడు వచ్చి దాటిపోతుండడంతో.. విజయ్ పెళ్లిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తనకు కాబోయే అమ్మాయి ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలో విజయ్ వివరించాడు. . తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ తన పెళ్లి ప్రస్తావన రాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెళ్లెప్పుడు చేసుకుంటారు అన్న ప్రశ్నకు ఆయన ‘ఎప్పుడు చేసుకోవాలనిపిస్తే అప్పుడు చేసుకుంటాను. అయితే నాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకునే తెలివైన అమ్మాయినే నాకు భార్యగా రావాలి.. అలాంటి అమ్మాయి తారసపడితే వెంటనే పెళ్లి చేసుకుంటాను. ఇక నా పెళ్లి పెద్ద హడావుడి లేకుండా జరుపుకోవడమే నాకు ఇష్టం’ అంటూ విజయ్ దేవరకొండ ఆన్సర్ ఇచ్చాడు. దీంతో విజయ్ చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటీవల విడుదలైన ఖుషి మూవీకి పాజిటివ్ టాక్ లభించింది.