ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఒక స్టార్ హీరో నుండి భారీ హిట్ కావాలి. ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాల్లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తప్ప, మిగిలిన చిత్రాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. బయ్యర్స్ ఘోరంగా నష్టపోయారు, ఆ సమయం లో చిన్న సినిమాలు ఆదుకున్నాయి కానీ, స్టార్ హీరోల సినిమాలు చేసిన నష్టాలు చిన్న సినిమాలు తెచ్చిన లాభాలు ఒక పక్కకి కూడా రాకపోవడం తో ఇప్పుడు కచ్చితంగా పెద్ద సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది.
అందుకే ఇప్పుడు అందరూ విజయ్ దేవరకొండ ‘ఖుషి’ చిత్రం వైపు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ మీడియం రేంజ్ హీరో అయ్యినప్పటికీ , ఈ సినిమాకి స్టార్ హీరో కి ఉన్నంత బజ్ ఉండడం తో ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నిన్ననే ప్రారంభం అయ్యాయి.
ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ఆశించిన స్థాయిలో గొప్పగా లేవు. మల్టీ ప్లెక్స్ షోస్ లో మంచిగానే ట్రెండింగ్ అవుతున్నప్పటికీ, సింగల్ స్క్రీన్స్ మాత్రం ఖాళీగానే ఉన్నాయి. అందుకు కారణం మైత్రీ మూవీ మేకర్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు సినిమా విడుదలకు సరిగ్గా రెండు రోజు ముందు టికెట్స్ సేల్స్ ప్రారంభించారు. అలా చెయ్యడం వల్ల ఒక్కసారిగా అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోవడం లో విఫలం అయ్యింది.
అదే వారం రోజుల ముందు ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి ఉంటే, నేడు వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చి ఉండేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. గతం లో పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్‘ చిత్రానికి కూడా ఇదే పద్దతిని అనుసరించి సుమారుగా 5 కోట్ల రూపాయిలు నష్టపోయారు, ఒకసారి నష్టం వచ్చిన తర్వాత కూడా అదే పద్దతి ఫాలో అవ్వడం తో ట్రేడ్ పండితులు మూవీ నిర్మాతల పై మండిపడుతున్నారు.