మూఢ నమ్మకాలను గుడ్డిగా అనుసరించేవాళ్ళు ఈ సమాజానికి ఎంత హానికరమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆధునిక యుగం లో సైన్స్ మరియు టెక్నాలజీ పరంగా మన నాగరికత ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా కొంతమంది ప్రముఖులు, ముఖ్యంగా సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు ఇలాంటి మూఢనమ్మకాలను గుడ్డిగా ఫాలో అవుతున్నారు. కొంతమంది అలా చేసి అడ్డంగా మీడియా కి దొరికిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.

కోట్లాది మంది అభిమానులకు ఆదర్శంగా నిల్చి, ఇలాంటి మూఢ నమ్మకాల నుండి అమాయకులను కాపాడాల్సిందే సినీ ప్రముఖులే ఇలా మూఢ నమ్మకాలను బలంగా నమ్మడం శోచనీయం. ఒక టాలీవుడ్ హీరో కూడా ఇలా మూఢ నమ్మకాలను గుడ్డిగా నమ్మి, చనిపోయిన మృత దేహానికి ఆయన తాళి కట్టాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలను చాలా సీరియస్ గా తీసుకొని ఆయన ఈ పని చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
ఇక అసలు విషయానికి వస్తే ఒక స్టార్ హీరో కి పెళ్ళై చాలా సంవత్సరాలు అయినా కూడా సంతానం కలగడం లేదు. అలాగే భార్య తో కూడా ఆయన సుఖం గా లేదు. పెళ్ళైన రోజు నుండి నేటి వరకు ఆమెతో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పోనీ విడిపోదాం అనుకుంటే భరణం క్రింద కోట్ల రూపాయిల ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందనే భయం తో విడాకులు తీసుకోకుండా సంసారం జీవితం కొనసాగిస్తున్నాడు.
ఇక మొదటి నుండి జాతకాలను విపరీరంగా నమ్మే ఆ స్టార్ హీరో, తనకి ఎంతో దగ్గరైన గురువు వద్దకి వెళ్లి సంతానం కలగడం లేదు, అది కలిగే మార్గం చెప్పమని ఆ జ్యోతిష్య గురువు ని అడగగా, చనిపోయిన ఒక కన్య మెడలో తాళి కడితే నీ జాతకమే మారిపోతుందని, ఏడాది దాటేలోపు పండింటి మగబిడ్డకు జన్మనిస్తావని చెప్పాడట ఆ జ్యోతిష్యుడు. అతను చెప్పినట్టుగానే చేసాడు ఆ హీరో , కానీ ఇప్పటి వరకు అతనికి సంతానం కలగలేదు.