టాలీవుడ్ మొత్తం ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్లు గా నటించిన ‘ఖుషి’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా విడుదలైన పెద్ద సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవ్వడం, బయ్యర్స్ భారీ నష్టాలను చవిచూడడం వల్ల ఇప్పుడు అందరూ ఆశలు ‘ఖుషి ‘ చిత్రం పై మరలింది. దానికి తోడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పాటలు మరియు ట్రైలర్ ఇలా అన్నీ కూడా అదిరిపోవడం తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

అయితే ఈ సినిమా ట్రైలర్ లో సమంత మరియు విజయ్ దేవరకొండ మధ్య జరిగిన రొమాన్స్, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.

అదేమిటంటే రీసెంట్ గా ‘బాయ్స్ హాస్టల్’ అనే కన్నడ సినిమా తెలుగు లో డబ్ అయ్యి విడుదలైంది. విడుదలకు ముందు ప్రీమియర్ షోస్ టాలీవుడ్ సెలెబ్రెటీలకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షో కి అక్కినేని నాగ చైతన్య కూడా హాజరు అయ్యాడు. ఈ సినిమా ఇంటర్వెల్ లో ‘ఖుషి’ మూవీ ట్రైలర్ రాగానే నాగ చైతన్య థియేటర్ నుండి బయటకి వెళ్ళిపోయాడట.

విజయ్ దేవరకొండ మరియు సమంత మధ్య రొమాన్స్ మరియు కెమిస్ట్రీ ని చూసి నాగ చైతన్య తట్టుకోలేక పోయాడట. అందుకే ఆయన లేచి వెళ్లిపోయాడని ఇండస్ట్రీ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. అంటే సమంత ని నాగ చైతన్య ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాడా..?, సమంత మీద ఫీలింగ్స్ లేకపోతే కూర్చొని అలాగే చూసేవాడు కదా అని అంటున్నారు నెటిజెన్స్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.