Rashmika : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తో నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. అతని పక్కన ఒక ఫ్రేమ్ లో అయినా కనిపిస్తే చాలు అని ఫిల్ అవుతుంటారు. కానీ ఆ ఛాన్స్ అందరి హీరోయిన్స్ కి అంత ఈజీగా దొరకదు. అయితే నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు మాత్రం ఈ అవకాశం చాలా త్వరగా వచ్చిందనే చెప్పాలి. కన్నడ నుంచి సినీ కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ.. టాలీవుడ్ సినిమాలతో సూపర్ ఫేమ్ ని సంపాదించుకుంది. ఈ స్టార్‌డమ్ తో ఇటీవల బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.
![Rashmika](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/07/rashmika2-1024x578.webp)
ఎంట్రీ తోనే అమితాబ్ బచ్చన్ సినిమాలో ప్రధాన పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత రణబీర్ సింగ్ నటిస్తున్న యానిమల్ సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకొనే అవకాశం అందుకుంది. షారుఖ్ తో కలిసి రష్మిక ఒక యాడ్ లో నటించింది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఫొటోలో షారుఖ్ లుక్స్ సూపర్ ఉన్నాయి. ఇక ఈ యాడ్ ఎప్పుడు ప్రసారం అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. రష్మిక స్పీడ్ చూస్తుంటే.. త్వరలోనే షారుఖ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కూడా అందుకునేలా ఉంది.
![](https://cdn.telugucinematoday.com/wp-content/uploads/2023/08/rashmika-1.gif)
బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం సౌత్ సినిమాలకు కూడా పెద్దగా ఓకే చెప్పడం లేదు. ఇటీవల నితిన్ సినిమాకి సైన్ చేసి, మళ్ళీ మూవీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం సౌత్ లో పుష్ప 2, ధనుష్-శేఖర్ కముల, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది. ఇక షారుఖ్ విషయానికి వస్తే.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ సినిమా సెప్టెంబర్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మరి పఠాన్ సక్సెస్ ని జవాన్ ముందుకు తీసుకు వెళుతుందా..? లేదా..? చూడాలి.